EPFO Higher Pension Scheme: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు ముఖ్యగమనిక. అధిక పెన్షన్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. హయ్యర్ పెన్షన్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 26వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మీరు కూడా అధిక పెన్షన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ నెల 26వ తేదీలోపు అప్లై చేసుకోండి. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
గతేడాది నవబంర్‌లో అధిక పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం నాలుగు నెలల్లోగా కొత్త ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది. మీరు అధిక పెన్షన్ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. రిటైర్మెంట్ తరువాత వచ్చే అమౌంట్ తగ్గుతుంది. కానీ మీకు నెలవారీ పెన్షన్ పెరుగుతుంది. ఈ పథకం వల్ల ఈపీఎఫ్ఓ లబ్దిదారులకు లాభాలు ఉన్నా.. కొంత నష్టం కూడా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక పెన్షన్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
==>> ఈ-సేవా పోర్టల్‌కి వెళ్లాలి.
==>> పెన్షన్ ఆన్ హయ్యర్ శాలరీపై క్లిక్ చేయండి
==>> న్యూ పేజీ ఓపెన్ అయిన తరువాత మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి
==>> సెప్టెంబర్ 1, 2014లోపు పదవీ విరమణ చేసినవారు మొదటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
==>> ప్రస్తుతం మీరు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు రెండో ఆప్షన్‌ను ఎంచుకోవాలి
==>> యూఏఎన్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
==>> మీ ఆధార్ కార్డుతో చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి.
అధిక పెన్షన్‌కు సంబంధించిన ప్రక్రియ వివరాలను గత వారం ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ కోసం వాటాదారులు, కంపెనీ యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 2014ను గతేడాది సుప్రీంకోర్టు సమర్థించింది. అంతకుముందు 2014 ఆగస్టు 22న నాటి ఈపీఎస్ రివిజన్ పెన్షన్ జీతం పరిమితిని నెలకు రూ.6,500 నుంచి నెలకు రూ.15 వేలకు పెంచింది. ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు, వారి యజమానులు 8.33 శాతం ఈపీఎస్‌కు జమ చేసేందుకు అనుమతించారు. ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసులకు ఈపీఎఫ్‌లో సర్క్యూలర్ జారీ చేసింది.
Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?
Also Read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి