Fixed Deposit Account Facts: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఐతే ఇవి తెలుసుకోండి
Fixed Deposit Account Facts: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే అంతకు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం..
Fixed Deposit Account Facts: సురక్షితమైన పెట్టుబడులు అనగానే.. చాలా మందికి గుర్తొచ్చేవి గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). ఇప్పుడు ఎఫ్‌డీల గురించి మాట్లాడుకుందాం. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌తో పోలిస్తే ఎఫ్డీ ద్వారా అధిక రిటర్నులు వస్తాయి. అందుకే ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు. ఎఫ్డీలో పెట్టబడి పెట్టేందుకు వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. కనీసం ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకూ ఎఫ్డీ పెట్టొచ్చు. ఆ తర్వాత 20 ఏళ్ల వరకు కూడా దీనిని పెంచుకోవచ్చు.
అయితే మీరు కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడేలా ఎఫ్డీలు చేయడం వల్ల ప్రయోదనాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఎఫ్డీ చేస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎఫ్డీకి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
ఇవి తెలుసుకోండి..
ఎఫ్డీ చేసేందుకు ముందు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు అనుకున్న సమయానికి ఏ బ్యాంకులు సరిపడా రిటర్నులు వస్తాయో దానినే ఎంచుకోవాలి.
మీరు ఎఫ్డీ చేసే బ్యాంక్..డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటి కార్పొరేషన్ (డీఐసీజీసీ) వద్ద రిజిస్టర్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి. అప్పుడే బ్యాంక్ దివాలా తీసినా రూ.5 లక్షల వరకు బీమా లభిస్తుంది.
మీ దగ్గర ఉన్న డబ్బునంతా ఒకే బ్యాంక్‌లో ఎఫ్డీ చేయొద్దు. రెండు, మూడు బ్యాంకుల్లో ఎఫ్డీ చేయాలి. రూ.5 లక్షల కన్నా తక్కువగా ఎఫ్డీ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
వడ్డీ రేట్లు మారుతుంటాయి కాబట్టి. వివిధ బ్యాంకుల్లో, వివిధ కాలపరిమితితో ఎఫ్డీ చేయాలి. అప్పుడే వడ్డీల ద్వారా లభించే ఆదాయం అధికంగా ఉంటుంది.
డబ్బు అవసరం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే కొంత మొత్తాన్ని తక్కువ కాల పరిమితితో ఎఫ్డీ చేయాలి. అత్యవసర సమయాల్లో దానిని మధ్యలో ఉపసంహరించుకున్నా.. పెనాల్టీలు పెద్దగా ఉండవు.
Also read: Hero Eddy electric scooter: రూ.72 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్, లైసెన్స్‌తో పనే లేదు!
Also read: GST Collections February 2022: ఐదోసారీ రూ.1.30 లక్షల కోట్లపైకి జీఎస్టీ వసూళ్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook