Realme Narzo 50: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి ఇటీవలే కొత్త మోడల్ రియల్‌మి నార్జో 50ని ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌లో 16 వేల రూపాయల ఈ ఫోన్‌ను..కేవలం 249 రూపాయలే పొందవచ్చు. ఎలాగంటారా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మి ఇటీవలే కొత్త మోడల్ ఫోన్ రియల్‌మి నార్జో 50ని భారతదేశ మార్కెట్‌లో లాంచ్ చేసింది కానీ అమ్మకాలు ప్రారంభించలేదు. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్, సూపర్ కెమేరా కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి అంటే మార్చ్ 3 నుంచి అమెజాన్ వేదికగా ప్రారంభమయ్యాయి. ఇవాళ మేం మీకు వివరించే ఆఫర్ ద్వారా..15 వేల 999 రూపాయల విలువైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 249 రూపాయలే పొందవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..నమ్మలేకపోతున్నారా..అంతా ట్రాష్ అనుకుంటున్నారా..కానే కాదు. ఎలాగో చూడండి..


15 వేల 999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి నార్జో 50 అమెజాన్ వేదికపై 3 వేల డిస్కౌంట్ అనంతరం 12 వేల 999 రూపాయలకు అందుతుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా క్యాష్‌బ్యాక్ కార్డు వినియోగిస్తే..మీకు మరో 5 శాతం అంటే 650 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ మీకు 12 వేల 349 రూపాయలకు లభిస్తుంది. 


ఎక్స్చేంజ్ ఆఫర్‌తో మరీ చవగ్గా


బ్యాంకు ఆఫర్ తరువాత ఇదే డీల్‌లో ఎక్చ్సేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే..అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తే ఇదే ఫోన్‌ను కేవలం 249 రూపాయలకు తీసుకోవచ్చు. అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం ద్వారా మీకు 12 వేల 100 రూపాయలు సేవ్ అవుతాయి. అంటే మొత్తం అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు పోగా..12 వేల 349 రూపాయలకు బదులు..249 రూపాయలే లభిస్తుంది.


ఇంత చవగ్గా వస్తుంది కదా అని తేలిగ్గా తీసిపారేసే ఫోన్ కాదిది. రియల్‌మి ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌లో జీ 96 ప్రోసెసర్ ఉంటుంది. 6.6 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లే ఉంటుంది. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ అదనపు ఆకర్షణ. దీంతో పాటు 33 వాట్స్ డార్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. దీని కెమేరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమేరా కాగా, 16 ఎంపీ ఫ్రంట్ కెమేరా ఉంది. 


Also read: Xiaomi Smart Home Days Sale: షావోమి నుంచి భారీ ఆఫర్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook