Xiaomi Smart Home Days Sale: షావోమి నుంచి భారీ ఆఫర్లు ఇవే

Xiaomi Smart Home Days Sale: షావోమి స్మార్ట్ హోమ్ డేస్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. మార్చ్ 7 నుంచి ప్రారంభమై...నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ పీరియడ్ ఉంటుంది. వివిధ రకాల పరికరాలపై కంపెనీ భారీ డిస్కౌంట్ల అందిస్తుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2022, 08:09 PM IST
 Xiaomi Smart Home Days Sale: షావోమి నుంచి భారీ ఆఫర్లు ఇవే

Xiaomi Smart Home Days Sale: షావోమి స్మార్ట్ హోమ్ డేస్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. మార్చ్ 7 నుంచి ప్రారంభమై...నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ పీరియడ్ ఉంటుంది. వివిధ రకాల పరికరాలపై కంపెనీ భారీ డిస్కౌంట్ల అందిస్తుంది.

ఈ తాజా ఆఫర్ల ప్రకారం షావోమి ఎంఐ రోబో వాక్యూమ్ మాప్ కేవలం 19 వేల 999 రూపాయలకే లభించనుంది. అటు ఎంఐ హోమ్ సెక్యూరిటీ 360 డిగ్రీల 1080 పిక్సెల్ కెమేరా 2 వేల 799 రూపాయలకు అందుతుంది. అటు ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫయర్ 2 వేలకు, ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ 3.. వేయి రూపాయలకు లభించనుంది. ఈ ఆఫర్లను ఎంఐ హోమ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ఆఫ్‌లైన్ స్టోర్లలో పొందవచ్చు.

అటు త్వరలో అందుబాటులో రానున్న ఎంఐ 360 హోమ్ సెక్యూరిటీ కెమేరా 2కే ప్రో, ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్, ఎంఐ స్మార్ట్ ఎల్ఈడీ డెస్క్‌ల్యాంప్ 1ఎస్, ఎంఐ స్మార్ట్ బెడ్‌సైడ్ ల్యాంప్ 2, ఎంఐ రూటర్ 4ఏ గిగాబైట్ మోడల్‌లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అటు ఈ సేల్ సందర్భంగా జరిగే కొనుగోళ్లపై కంపెనీ డిస్కైంట్ కూపన్లు కూడా అందించనుంది. ఎంఐ.కామ్‌లో ఎక్చ్సేంజ్ ప్రయోజనాలు కూడా వర్తించనున్నాయి. అదే సమయంలో సాయంత్రం 4 గంటలకు కంపెనీ వైప్ అవుట్ సేల్ నిర్వహించనుంది. ఇందులో రోజుకు రెండు డివైస్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటిస్తుంది.

అద్భుతమైన, ఎన్నడూ చూడని భారీ ఆఫర్లు కేవలం నాలుగు రోజులే ఉంటాయి. మార్చ్ 7 నుంచి మార్చ్ 10 వతేదీ వరకూ మాత్రమే వర్తిస్తాయి. షావోమీ ఎంఐ రోబో వాక్యూమ్ మాప్ 24 వేల 999 రూపాయలకు బదులు 19 వేల 999 రూపాయలకు లభించనుంది. ఇక ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ 3 అసలు ధర 10 వేల 999 రూపాయలు కాగా డిస్కౌంట్ అనంతరం 9 వేల 999 రూపాయలకు లభించనుంది. ఎంఐ 360 డిగ్రీల హోమ్ సెక్యూరిటీ కెమేరా 2కే ప్రో 4 అసలు ధర 4 వేల 499 రూపాయలు కాగా, డిస్కౌంట్ అనంతరం 3 వేల 999 రూపాయలకు లభిస్తుంది. మరికొన్ని ఆఫర్లను కూడా త్వరలో కంపెనీ ప్రకటించనుంది. 

Also read: Free fire: ఈ సారి ఫ్రీ ఫైర్ వంతు- గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్ వేటు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News