Discount Bonanza on Cars: దేశంలో త్వరలో ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. ఈ నెలాఖరున ఓనమ్, గణేశ్ చతుర్థితో మొదలై దసరా, దీపావళి వంటి పెద్ద పండగలు రాబోయే నెలల్లో రాబోతున్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు బేసిక్ మోడల్స్‌పై కస్టమర్స్‌కు బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించబోతున్నాయి. ఇందులో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా కారు కొనాలనుకునేవారు ఫెస్టివల్ సీజన్‌లో వెహికల్ బుకింగ్‌కి వెళ్లడం బెటర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏయే కార్లపై ఎంత తగ్గింపు :


మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో, ఆల్టో 800, స్విఫ్ట్, సెలేరియో వంటి మోడల్స్‌పై రూ.9 వేలు నుంచి రూ.60వేలు వరకు ఫెస్టివ్ సీజన్‌లో ఆఫర్ అందుబాటులో ఉండనుంది.


హ్యుందాయ్‌లో సాంట్రో, ఐ10, NIOS,Aura,i20,Xcent,Kona Ev కార్లపై రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ఆఫర్ అందుబాటులో ఉండనుంది.


టాటా మోటార్స్ సంస్థ ఆయా మోడల్స్‌పై రూ.20 వేలు నుంచి రూ.40 వేలు వరకు డిస్కౌంట్ అందించనుంది.


ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి వెహికల్స్‌పై మహీంద్రా అండ్ మహీంద్రా డిస్కౌంట్స్ అందించనుంది. 


రెనాల్ట్, టయోటా కూడా కొన్ని మోడల్స్‌పై డిస్కౌంట్స్‌ను అందించనున్నాయి.


ధరలు ఎందుకు తగ్గనున్నాయి : 


మారుతీ సుజుకీ ఈ ఏడాది ప్రారంభంలో 1,20,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడది 2,12,000 వరకు చేరింది. ప్రొడక్షన్ టార్గెట్‌లో దాదాపు 95 శాతానికి చేరువగా ఉంది. అయితే ఇప్పటికే చాలా పెండింగ్ బుకింగ్స్ ఉండటం, మార్కెట్‌లో కొన్ని మోడల్స్‌కి అంతర్లీనంగా నెలకొన్న డిమాండ్, రిటైల్స్ కన్నా హోల్ సేల్ డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఫెస్టివ్ సీజన్‌లో ఎక్కువ బుకింగ్స్ జరిగే అవకాశం ఉండటం వంటివి ప్రస్తుతం మారుతీ ముందున్న సవాళ్లుగా ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.


'మార్కెట్‌లో డిమాండ్‌ కన్నా సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా ధరలు తగ్గుతాయి. మారుతీ సుజుకీలో ఎంట్రీ లెవల్ కార్లు ఆల్టో 800, ఎస్-ప్రెస్సో, వాగన్ఆర్, బ్రీజా వంటి కార్లపై ఎస్‌యూవీ వాహనాలతో పోలిస్తే ఎక్కువ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.' అని శ్రీవాత్సవ వెల్లడించారు.


టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా మాట్లాడుతూ.. ఓనమ్‌తో ఫెస్టివల్ సీజన్ ప్రారంభమవుతుందన్నారు. గడిచిన రెండేళ్ల సేల్స్‌ను గమనిస్తే ఫెస్టివల్ సీజన్‌లో సేల్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు తగినట్లుగా సప్లై కోసం చర్యలు తీసుకుంటున్నామని.. అయినప్పటికీ ఈ గ్యాప్ కొనసాగే అవకాశం ఉందని అన్నారు. సప్లై తగినంత లేనప్పటికీ కస్టమర్స్‌‌ను ఉత్సాహపరిచేందుకు కొన్ని మోడల్స్‌పై డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నామన్నారు. ఆకర్షణీయమైన స్కీమ్స్‌తో పాటు ఎక్స్‌చేంజ్ బోనస్ బెనిఫిట్స్ కూడా తీసుకొస్తున్నామన్నారు.


Also Read: Pitru Paksha: పెద్దల అమావాస్య ఎప్పుడొస్తోంది.. పితృ దోష విముక్తికి ఏం చేయాలి.. ఈ 15 రోజులు చేయకూడని పనులేంటి..


Also Read: KomatiReddy Rajgopal Reddy Live Updates: ఇవాళ స్పీకర్ కు కోమటిరెడ్డి రాజీనామా.. ఉప ఎన్నిక డేట్ ఫిక్స్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook