Employees Leaves: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024లో కీలకమైన ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎర్న్డ్ లీవ్స్ అంటే ఈఎల్‌ను ప్రభుత్వం పెద్దఎత్తున పెంచనుందని సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ప్రయోజనం కలగనుంది. ఏకంగా రెండు నెలలు సెలవులు అదనంగా రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ఉద్యోగుల ఈఎల్‌ను 240 నుంచి 300 కు పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కార్మిక శాఖ, కార్మిక సంఘాల ప్రతినిధులకు పనిగంటల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయితే లేబర్ కోడ్ నిబంధనల్లో మార్పులు రావచ్చు. ఉద్యోగుల పని గంటలు, వార్షిక సెలవులు, పెన్షన్, పీఎఫ్, నెట్ శాలరీ, రిటైర్మెంట్ ఇతరత్రా అంశాలపై కార్మిక సంఘాల ప్రతినిధులకు కార్మిక శాఖకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఉద్యోగుల ఎర్న్డ్ లీవ్స్‌ను 240 నుంచి 300 కు పెంచాలనే డిమాండ్ ఉంది. 


ఎర్న్డ్ లీవ్స్ పరిమితిని 240 నుంచి 300 కు పెంచాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. పార్లమెంట్‌లో సెప్టెంబర్ 2020న కొత్త కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లులు చట్టరూపం దాల్చాయి. వీటిని సాధ్యమైనంత త్వరలో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బడ్జెట్ సందర్భంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయవచ్చు. 


లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ అనేది మొత్తం జీతంలో 50 శాతం కంటే ఎక్కువ ఉండాలి. దీనివల్ల ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌లో మార్పు వస్తుంది. బేసిక్ శాలరీ పెరిగితే ఫీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరుగుతాయి. అయితే టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. 


కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఉద్యోగుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది. మోదీ రెండవ దఫా ప్రభుత్వంలో ఇది చివరి బడ్జెట్. ఎన్నికల ఏడాది కావడంతో ఉద్యోగవర్గాల్నించి లబ్ది పొందే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని అంచనా. కొత్త లేబర్ చట్టాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించవచ్చు. 


Also read: Flipkart New Facility: ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త విధానం, ఆర్డర్ చేసిన రోజే డెలివరీ


Also read: Leap Year 2024: లీప్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఎందుకు, లీప్ ఇయర్ చుట్టూ ఉన్న నమ్మకాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook