Leap Year 2024: ప్రతి నాలుగేళ్లకోసారి లీప్ ఇయర్ వస్తుంటుంది. సంవత్సరానికి 365 రోజులుంటే..లీప్ ఇయర్‌లో మాత్రం 1 రోజు అధికంగా 366 రోజులుంటుంది. ఇలా ఎందుకుంటుంది, అసలు ఫిబ్రవరిలోనే లీప్ ఇయర్ ఎందుకుండాలి, వేరే నెలల్లో ఎందుకు కాదనే విషయంపై ఆసక్తికరమైన అంశాలున్నాయి.
భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 గంటలు. దీన్ని ఒకరోజుగా కొలుస్తారు. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు పట్టే కాలం కచ్చితంగా లేదు. 365.2422 రోజులుంగా ఉంటుంది. అంటే 365 రోజులకంటే ఎక్కువ. ఈ ఎక్కువగా ఉన్న సమయం కాస్తా ప్రతి నాలుగేళ్లకు ఒక రోజు అవుతుంది. అందుకే నాలుగేళ్లకోసారి సంవత్సరం క్యాలెండర్‌లో ఒక రోజు అధికంగా చేరుతుంది. దీనినే లీప్ ఇయర్ అంటారు. ఇంతవరకూ కధ అందరికీ తెలిసిందే. అయితే లీప్ ఇయర్ అనేది అంటే 1 రోజు అధికంగా కలపడం అనేది ఫిబ్రవరి నెలకే ఎందుకనేదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
లీప్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఎందుకు
నిజమే మరి. సంవత్సరంలో 12 నెలలుంటే ఫిబ్రవరి నెలకే లీప్ ఇయర్ ఎందుకు ఆపాదించడం అనే ప్రశ్న రావడం సహజమే. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ లేదు గానీ సాంప్రదాయం లేదా చరిత్ర ఉందని చెప్పవచ్చు. మొత్తం మానవ నాగరికతలో చాలా అంశాలకు ఆద్యం రోమ్ నాగరికతే. అందుకే రోమ్ క్యాలెండర్ ప్రకారమే ప్రపంచం నడిచేది. ఆ క్యాలెండర్‌లో కొద్దిపాటి మార్పులతోనే ఇంగ్లీష్ క్యాలెండర్ నడుస్తోంది. ప్రాచీన రోమ్‌లో జూలియస్ సీజర్ క్యాలెండర్‌లో మార్పులు చేసింది ఫిబ్రవరి నెలలోనే. ఈజిప్ట్ సోలార్ క్యాలెండర్ నుంచి ప్రేరణ పొందిన జూలియస్ సీజర్ చక్రవర్తి జూలియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. సోలార్ సంవత్సరంతో కలిపేందుకు లీప్ ఇయర్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత అంటే 1582లో వచ్చిన గ్రెగేరియన్ క్యాలెండర్‌లో కూడా లీప్ ఇయర్‌ను ఫిబ్రవరిలోనే కలపడమనే సాంప్రదాయం కొనసాగింది.
లీప్ ఇయర్ తెలుసుకోవడం ఎలా
లీప్ ఇయర్ తెలుసుకోవాలంటే చాలా సులభం. ఏదైనా సంవత్సరాన్ని 4 తో భాగిస్తే శేషం సున్న వచ్చిందంటే అది లీప్ ఏడాది. అయితే 2000 సంవత్సరం లీప్ ఇయర్ కానీ 2100 కూడా 4తో భాగించబడినా అది లీప్ ఇయర్ కాదు.
లీప్ ఇయర్ మంచిదా కాదా, ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలేంటి
లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరి 29వ తేదీని Sadie Hawkins Dayగా పిలుస్తారు. 1937లో ప్రారంభమైంది. పెళ్లిళ్లకు శుభప్రదం కాదంటారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 29 మంచి రోజు కాదు. స్కాట్లండ్‌లో లీప్ డే నాడు అతీంద్రీయ శక్తులు దుష్టకార్యం కోసం ఏకమౌతాయనే నమ్మకం ఉంది. ఆ రోజు పెళ్లి చేసుకోవద్దని అంటారు. కొందరైతే అ సంవత్సరమంతా వివాహాలు మానుకుంటారు.
లీప్ డే రోజున ప్రత్యేకంగా కొన్ని వేడుకలు జరుపుకుంటారు. లీప్ ఇయర్ డే రోజున పుట్టిన పిల్లలతో ప్రత్యేకంగా ఓ క్లబ్ కూడా నడుస్తోంది. ఇక ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా సైన్స్ ప్రకారం మాత్రం..సూర్యుని చుట్టూ భూమి తిరిగే క్రమంలో ఏర్పడిన క్యాలెండర్ గతి తప్పకుండా కొనసాగించే ప్రక్రియలో భాగమే లీప్ ఇయర్. దీనికి వేరే ఎలాంటి మహత్యం, ప్రాధాన్యతలు లేవు.
Also read: Budget Facts: దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook