Post Office Saving Schemes: పోస్టాఫీసు పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. ఎక్కువ జనాధారణ పొందిన పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, స్మాల్ సేవింగ్ స్కీమ్‌లపై వడ్డీ రేటును 1.1 శాతం పెంచింది. పెంచిన వడ్డీ రేటు జనవరి 1 నుంచి అంటే రేపటి నుంచి అమలులోకి రానుంది. వడ్డీ రేటులో మార్పు తర్వాత.. ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మునుపటి కంటే రెట్టింపు వేగంగా పెరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెపో రేటు పెంపు తర్వాత మార్పులు..


ఆదాయపు పన్ను ప్రయోజనం పొందని పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వం వడ్డీని పెంచింది. ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును పెంచింది. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. న్యాక్ (ఎన్‌ఎస్‌సీ), ఎస్‌సీఎస్ (ఎస్‌సీఎస్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీలపై వడ్డీ రేటు 1.1 శాతం వరకు పెరిగింది.


వివిధ పథకాలపై అందుబాటులో ఉన్న వడ్డీ..


ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)పై 6.8 శాతం చొప్పున వడ్డీ అందుబాటులో ఉంది. ఇక జనవరి 1 నుంచి 7 శాతానికి పెరగనుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌కు 7.6 శాతం నుంచి 8 శాతం వడ్డీ రానుంది. ఒకటి నుంచి ఐదేళ్ల వరకు పోస్టాఫీసు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 1.1 శాతం పెరుగుతాయి. కొత్త రేట్ల ప్రకారం పోస్టాఫీసులో ఒక సంవత్సరం ఎఫ్‌డీకి 6.6 శాతం, రెండేళ్లకు 6.8 శాతం, మూడేళ్లకు 6.9 శాతం, ఐదేళ్లకు ఏడు శాతం వడ్డీ లభిస్తుంది.


10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న కేవీపీ వడ్డీ రేటును ప్రభుత్వం 7.2 శాతం పెంచింది. సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత వడ్డీ రేటు 7.6 శాతం అలాగే ఉంచారు. అదేవిధంగా పీపీఎఫ్‌ వడ్డీ రేటు కూడా 7.1 శాతంలో మార్పు లేదు.


Also Read: Bhairi Naresh: అయ్యప్పపై దారుణ కామెంట్స్.. వరంగల్‌లో భైరి నరేష్ అరెస్ట్   


Also Read: Gujarat Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి.. 28 మందికి గాయాలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి