Gujarat Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి.. 28 మందికి గాయాలు

Gujarat Bus Car Accident: గుజరాత్ బస్స-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 12:06 PM IST
Gujarat Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి.. 28 మందికి గాయాలు

Gujarat Bus Car Accident: గుజరాత్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్‌సారిలో 48వ నెంబరు జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన 11 మందిని నవ్‌సారిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు నవ్‌సారి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. వల్సాద్‌లో 17 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఒక ప్రయాణికుడిని చికిత్స కోసం సూరత్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.  

ప్రాథమిక సమాచారం ప్రకారం.. లగ్జరీ బస్సు అహ్మదాబాద్ సెంటినరీ ఫెస్టివల్ ప్రయాణికులతో వల్సాద్ వైపు వెళుతోంది. రేష్మా గ్రామ సమీపంలో అటునుంచి వస్తున్న ఫార్చ్యూనర్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో రోడ్డుపై చాలాసేపు జామ్‌ ఏర్పడింది. క్రేన్‌ సాయంతో బస్సును పక్కకు తీసుకెళ్లడంతో వాహనాలు సాఫీగా వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో మరికొంతమంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలు కాగా.. వారిని ప్రథమ చికిత్స అనంతరం వారి ఇళ్లకు తరలించారు.

ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద ఘటన విచారకరమని అన్నారు. 
తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. 

 

Also Read: APSRTC: ఏపీఎస్ఆర్టీసీ పండుగ ఆఫర్.. టికెట్ల కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్లు

Also Read: Tollywood 2022 : అదిరిన ఆరంభం.. ముభావమైన ముగింపు.. గెలిచిన చిత్రాలివే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News