Stock market: కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో కుప్పకూలిన మార్కెట్
Stock market: కరోనా సెకండ్ వేవ్ షేర్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రెండో దశలో దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేసింది.
Stock market: కరోనా సెకండ్ వేవ్ షేర్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రెండో దశలో దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేసింది.
కరోనా సెకండ్ వేవ్.ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు ఆంందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్(Corona second wave), అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపధ్యంలో స్టాక్ మార్కెట్(Stock Market)పై తీవ్ర ప్రభావం పడింది. భారీ నష్టం చేకూరింది. సెన్సెక్స్ 916, నిఫ్టీ 276 పాయింట్ల మేర నష్టపోయాయి. అనంతరం మరింత క్షీణించిన సెన్సెక్స్ 1160 పాయింట్ల నష్టంతో 48 వేల 430 వద్ద, నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 14 వేల 482 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల దెబ్బతో కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంకు కూడా దాదాపు 12 వందల పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్ (Sensex) 1353 పాయింట్ల నష్టంతో 48 వేల 423 వద్ద, నిఫ్టీ ( Nifty 411 పాయింట్లు పతనమై 14 వేల 423 వద్ద కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 48వేల 300, నిఫ్టీ 14 వేల 500 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలనందించాయి. దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితంగా చేస్తోంది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
దేశంలో కరోనా కొత్త కేసుల విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. గత 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 1 లక్షా 68 వేల 12 కొత్త కేసులు నమోదయ్యాయి.
Also read: Gold Price Today 12 April 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం, మిశ్రమంగా వెండి ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook