RBI new rules: ఆన్లైన్ లావాదేవీలా? ఆర్బీఐ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!
RBI new rules: ప్రస్తుతం ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లావాదేవీ జరిపితే.. అందులో పేమెంట్ వివరాలు సేవ్ అవుతాయి. కానీ ఇకపై అలా కుదరదు. యూజర్ల పేమెంట్ వివరాలు సేవ్ చేసుకోకుండా.. 2022 నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది ఆర్బీఐ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
RBI New Rules: ఆన్లైన్ చెల్లింపులు మరింత సురక్షితం (Safe online transactions) చేయడంలో భాగంగా ఆర్బీఐ (RBI) కొత్త నిబంధనలను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ-కామర్స్ దిగ్గజాలు, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు తమ పేమెంట్ గేట్‌వేలలో వినియోగదారుల క్రెడిట్, డిబిట్ కార్డ్‌ల వివరాలు సేవ్ చేసుకోకుండా నియంత్రించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా సంస్థలు తమ గేట్‌వేల నుంచి యూజర్ల పేమెంట్ వివరాల డేటా బేస్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు తప్పనిసరి కానున్నాయి.
కొత్త నిబంధనల ఏం చెబుతున్నాయి..
2022 జనవరి 1 నుంచి ఎవరైనా ఆన్లైన్ లావాదేవీలు జరపాలంటే.. తమ క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు ప్రతి సారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందికరమని భావిస్తే.. టోకనైజేషన్ (Tokenisation) పద్దతిని ఎంచుకోవచ్చు.
ఏమిటి ఈ టోకనైజేషన్ (What is Tokenisation)..
భౌతికంగా క్రెడిట్, డెబిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఈ టోకనైజేషన్‌ను చెప్పవచ్చు. కార్డ్ వివరాలకు బదులు ఇందులో ఓ కోడ్ ఉంటుంది. దీనినే టోకెన్ అంటారు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ఈ కోడ్‌ను ఇస్తే సరిపోతుంది.
ఇది వినియోగదారుల కార్డలకు సంబంధించి ఒక రిఫరెన్స్ మాత్రమే. కాబట్టి ఈ వివరాలను బయటకు తెలిసినా సమస్య ఉండదు. ఈ పద్ధతిలో అదనపు వెరిఫికేషన్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి సురక్షితంగా ఉంటుందని భావిస్తోంది ఆర్బీఐ.
మరిన్ని వివరాలు..
2022 జనవరి 1 నుంచి ఏ ప్లాట్‌ఫామ్ కూడా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను సేవ్ చేసుకోలేవు
టోకనైజేషన్ ద్వారా ఒకసారి కార్డు వివరాలను ఏదైనా ప్లాట్‌ఫామ్‌కు సమర్పిస్తే.. వాటిని భవిష్యత్ లావాదేవీలకు సమర్పించొచ్చు
ఆర్బీఐ ఆదేశాలతో ఇప్పటికే రూపే, మాస్టర్ కార్డ్, వీసా సహా పలు ఇతర పేమెంట్ గేట్వేలు టోకనైజేషన్‌ను ప్రారంభించాయి
టోకనైజేషన్ సౌకర్యం కోసం వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు
దేశీయ లావాదేవీలకు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్ వర్తించవు
టోకనైజేషన్‌ను వినియోగించుకోవడం కస్టమర్ల ఐచ్ఛికమే. ఇబ్బంది లేదు అనుకుంటే ప్రతి సారీ మాన్యూవల్‌గా కార్డ్ వివరాలను ఎంటర్ చేసి పేమెంట్ చేయొచ్చు
Also read: Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే మిగిలింది
Also read: Go First Offering Discount: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే విమాన ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook