Deloitte Report on India: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమిది. ఇండియా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో దూరంలో లేదు. ఇది ఎవరో రాజకీయ నేతలు చెబుతున్న మాటలు కావు. ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ అందిస్తున్న వివరాలివి. అవేంటో పరిశీలిద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ(5 Trillion Dollars Economy)గా ఎదగాలనేది లక్ష్యమని..అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) తరచూ చెబుతున్న మాట. ఆ దిశగా ఇండియా ఎదగడానికి ఎంతో దూరం లేదని తెలుస్తోంది. ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ డెలాయిట్ చేస్తున్న విశ్లేషణ ఇది. ఇండియా 2026-27 నాటికి 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా అంటే 368 లక్షల కోట్ల విలువ గల ఆర్ధిక శక్తిగా ఎదగడానికి కావల్సిన పెట్టుబడుల గురించి డెలాయిట్(Deloitte) విశ్లేషించింది. ఇండియా ఆ లక్ష్యాన్ని సాధించాలంటే 8 ట్రిలియన్ డాలర్ల గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడులు(Green Field Investments) అవసరమని డెలాయిట్ అంచనా వేస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో ఒక విధానం. ఈ విధానంలో పేరెంట్ కంపెనీ వివిధ దేశాల్లో అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేసి కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా భారీగా పెట్టుబడులు పెడుతుంది. ఇండియాలో ఈ తరహా భారీ పెట్టుబడుల ఆవశ్యకతను డెలాయిట్ ఇచ్చిన తాజా నివేదికలో వివరించింది. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్‌లోని మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన 12 వందలమంది వ్యాపారవేత్తల అభిప్రాయాలతో ఈ అధ్యయనం తయారైంది. 


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇండియా ఆకర్షణీయమైన దేశంగా(India Economy)ఉందని డెలాయిట్ నివేదిక పేర్కొంది. నిపుణులైన కార్మిక శక్తి, ఎకానమీ అభివృద్ధి వంటి అవకాశాలు దీనికి కారణమని చెబుతోంది. ఇండియాలో మరింతగా సంస్కరణల ఆవశ్యకత ఉందని నివేదిక తెలిపింది. అన్నీ సమకూరితే దేశానికి భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తాయంటోంది. కోవిడ్ 19 సవాళ్ల నేపధ్యంలో సైతం ఇండియాకు భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయనేది డెలాయిట్ నివేదిక సారాంశం. ఈ పెట్టుబడులు దేశ ఆర్ధిక వ్యవస్థకు అనుకూలమైన పరిస్థితి, ఆర్ధిక మూలాలకు పటిష్టతను అందించింది. 2020-21లో ఈక్విటీ, రీ ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, క్యాపిటల్ సహా రికార్డు స్థాయిలో 81.72 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ ముందున్న ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది పది శాతం అధికం కావడం విశేషం. 


Also read: Flipkart New Offer: భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పరిమితి, ఎలా పొందాలంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook