Flipkart New Offer: భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పరిమితి, ఎలా పొందాలంటే

Flipkart New Offer: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వేదిక ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. షాప్ నౌ..పే లేటర్ సదుపాయం పరిమితిని భారీగా పెంచింది. పండుగ వేళ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2021, 02:20 PM IST
  • పండుగ పురస్కరించుకుని సరికొత్త ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
  • షాప్ నౌ..పే లేటర్ పరిమితిని అమాంతంగా పెంచిన ఫ్లిప్‌కార్ట్
  • ఫ్లిప్‌కార్ట్‌లో పే లేటర్ సదుపాయాన్ని ఎలా పొందాలి
Flipkart New Offer: భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పరిమితి, ఎలా పొందాలంటే

Flipkart New Offer: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వేదిక ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. షాప్ నౌ..పే లేటర్ సదుపాయం పరిమితిని భారీగా పెంచింది. పండుగ వేళ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్(Flipkart Big Billion Days Sale) నడుస్తోంది. పండుగ నేపధ్యాన్ని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ (Flipkart Offer)సరికొత్త ఆఫర్ అందిస్తోంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న షాప్ నౌ..పే లేటర్ పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నచ్చిన వస్తువులు ఇప్పుడు కొనుగోలు చేసుకుని..పే లేటర్ ద్వారా వచ్చే నెలలో బిల్ చెల్లించవచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నా క్రెడిట్ లిమిట్ కేవలం 10 వేల రూపాయల వరకే ఉంది. అదికూడా ఎంపిక చేసిన 10 కోట్లమంది కష్టమర్లకే అందుబాటులో ఉంది. పండుగ వేళ కావడంతో మరింతమందికి పే లేటర్ అవకాశాన్ని కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. అంతేకాదు పే లేటర్ పరిమితిని 10 వేల రూపాయల్నించి ఏకంగా 70 వేల రూపాయల వరకూ పెంచింది. పండుగ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ లిమిట్ పెంచినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పే లేటర్ ఆప్షన్‌లో వినియోగించిన మొత్తాన్ని కస్టమర్లు వెసులుబాటును బట్టి ఈఎంఐ పద్ధతిలో చెల్లించే వీలు కల్పించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో పే లేటర్ సౌకర్యాన్ని ఎలా పొందాలి(How to Avail flipkart pay later)

పే లేటర్ ఆప్షన్(Pay Later) పొందాలంటే ఆధార్ కార్డు , బ్యాంకు డీటైల్స్ అందివ్వడం ద్వారా పే లేటర్ సౌకర్యాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో(Flipkart App) మోర్ ఆన్ ఫ్లిప్‌కార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత క్రెడిట్ ఆప్షన్‌లో వెళితే పే లేటర్ వివరాలు కన్పిస్తాయి. ఆ సూచనల్ని పాటిస్తూ..పే లేటర్ ఆప్షన్ పొందవచ్చు. కొత్తగా మరో పదికోట్లమందికి ఈ సౌకర్యాన్ని అందించాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఈ కామర్స్ సైట్స్‌లో కొనుగోలు సందర్భంగా పదే పదే బిల్లుల్ని చెల్లించడానికి బదులు నెలలో జరిగిన చెల్లింపులన్నింటికీ ఒకేసారి బిల్లు పొంది..ఆ మొత్తాన్ని వచ్చే నెలలో కూడా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు(Credit Card) లేనివారికి పే లేటర్ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ టీజర్‌లో భాగంగా సౌండ్ బార్స్, బోట్ కంపెనీ ప్రొడక్ట్స్‌పై దాదాపు 80 శాతం తగ్గింపు, స్మార్ట్ వాచెస్‌పై 70 శాతం తగ్గింపు అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఇంటెల్ ల్యాప్‌టాప్‌పై 40 శాతం వరకూ తగ్గింపు ఉండనుంది. టీవీలపై 70 శాతం, రిఫ్రిజిరేటర్లపై 50 శాతం, గృహోపకరణాలపై 70 శాతం తగ్గింపు ఉండనుంది. 

Also read: Nokia C01 Plus: జియోకి పోటీగా నోకియా బడ్జెట్‌ ఫోన్‌..! ఫీచర్స్ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News