Flipkart Big Saving Days Sale: ప్రస్తుతం ఈ కామర్స్ వేదికలు డీల్ ఆఫర్స్ అందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ ఈ కామర్స్ వేదికలుగా ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక సేల్ ప్రారంభించాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకూ ఐదురోజుల పాటు అందుబాటులో ఉంటే..ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 9 వరకూ ఆరు రోజులు అందుబాటులో ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా వివిధ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే వివిధ రకాల బ్రాండెడ్ ఉత్పత్తులు చాలా తక్కవ ధరకే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 14 నుంచి శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 వరకూ అన్నింటిపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో జరిపే ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై అయితే ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 14, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, గూగుల్ పిక్సెల్ 6ఏ, శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 వంటి ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. వీటితోపాటు రెడ్ మి, ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై సైతం ఆఫర్లు ఉన్నాయి. అంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అధికారింగా ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డుల వినియోగిస్తే అదనంగా మరి కొంత డిస్కౌంట్ లభించనుంది. 


కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో వేర్వేరు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. కోటక్ క్రెడిట్ కార్డు అయితే ప్రతి లావాదేవీకు 1750 రూపాయలు తగ్గుతుంది. డెబిట్ కార్డు అయితే గరిష్టంగా 500 రూపాయలు మినహాయింపు ఉంటుంది. కిరాణా సామగ్రి 2000 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 


ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై గరిష్టంగా 1750 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. డెబిట్ కార్డుపై ఇక్కడ కూడా 500 రూపాయలు తగ్గింపు ఉంటుంది. మొబైల్, టీవీలు, ల్యాప్‌టాప్స్ వంటి గ్యాడ్జెట్స్‌పై కొనుగోలు విలువ 5000 దాటితే ప్రత్యేక ఆఫర్ లభిస్తుంది. కిరాణా సామగ్రిపై 2000 దాటితే డిస్కౌంట్ పొందవచ్చు.


Also read: IT Returns: ఐటీ రిటర్న్స్‌లో తప్పులకు నోటీసులొస్తే ఏం చేయాలి, సరిచేసే అవకాశముందా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook