iPhone 12 Mini Flipkart: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్.. మరోసారి తమ కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. Apple కంపెనీకి చెందిన iPhone 12 Mini పై ప్రత్యేక తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. దాదాపు రూ.60 వేల విలువ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లోని ఆఫర్ ద్వారా రూ.32 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఆ ఆఫర్ పొందాలంటే ఎలానో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 12 Miniపై భారీ తగ్గింపులు


Apple కంపెనీకి చెందిన iPhone 12 Mini వేరియంట్ 64GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. రూ. 59,900 ధర కలిగిన ఈ ఐఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ 16 శాతం తగ్గింపును ఇస్తుంది. దీంతో ఆ స్మార్ట్ ఫోన్ ధర కాస్త రూ.49,999లకు చేరింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ కొనుగోలు చేసేప్పుడు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్టుతో చెల్లిస్తే.. మీకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ తో iPhone 12 Mini ధర రూ.47,499కు తగ్గనుంది.  


ఈ ఆఫర్లతో పాటు iPhone 12 Mini కొనుగోలు చేసే క్రమంలో మీ పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా అత్యధికంగా రూ.15,850 తగ్గింపు లభించనుంది. ఫలితంగా iPhone 12 Mini రూ.31,649లకే కొనుగోలు చేయవచ్చు. 


iPhone 12 Mini ఫీచర్లు


స్టోరేజ్ - 64 GB


A14 బయోనిక్ చిప్ ప్రాసెసర్


12 MP - ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా


5G సపోర్టెడ్ డివైస్


డిస్ ప్లే - 5.4 అంగుళాల సూపర్ రెటీనా XDR


డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ


iPhone 12 Mini డివైస్ కు ఏడాది పాటు వారెంటీ.  


Also Read: BSNL Unlimited Plans: రూ.200 కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా


Also Read: Go first republic Day offer: గో ఫస్ట్​ రిపబ్లిక్​ డే ఆఫర్​- రూ.926కే విమాన టికెట్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook