Go first republic Day offer: గో ఫస్ట్​ రిపబ్లిక్​ డే ఆఫర్​- రూ.926కే విమాన టికెట్​!

Go first republic Day offer: దేశీయంగా విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్​ న్యూస్​. రిపబ్లిక్​ డే సందర్భంగా గో ఫస్ట్​ సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 03:59 PM IST
  • మరో కొత్త ఆఫర్​తో ముందుకొచ్చిన గో ఫస్ట్​
  • రిపబ్లిక్ డే సందర్భంగా టికెట్​ ధరలపై భారీ తగ్గింపు
  • దేశీయ ప్రయాణాలకు మాత్రమే వర్తింపు!
Go first republic Day offer: గో ఫస్ట్​ రిపబ్లిక్​ డే ఆఫర్​- రూ.926కే విమాన టికెట్​!

Go first republic Day offer: ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్​ సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. రిపబ్లిక్​ డే సందర్భంగా వినియోగదరాలను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు (Go first new offer) తెలిపింది.

'రైట్​ టూ ఫ్లై' పేరుతో ఈ ఆఫర్​ను తీసుకొచ్చింది గో ఫస్ట్​. ఇందులో రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం (Go first latest news) చేసింది.

ఆఫర్ పూర్తి వివరాలు..

ఈ అఫర్​ కింద టికెట్ సేల్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జనవరి 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో (Go first republic offer last date) ఉండనుంది. ఈ సమయంలో టికెట్ బుక్​ చేసుకున్న ప్రయాణిమకులు.. తమ ప్రయాణ తేదీలను ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31 లోపు  అనువైన రోజును ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్ ఒకసారి ప్రయాణనికి (వన్​ వే) మాత్రమే వర్తిస్తుంది.

కంపెనీ అధికారిక వెబ్​సైట్​తో పాటు.. ఇతర అన్ని ఛానెల్స్​ ద్వారా బుక్​ చేసుకున్నా ఈ ఆఫర్​ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది.

ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు.

టికెట్ క్యాన్సిలెషన్​ సదుపాయం ఉంది. అయితే సాధారణ నిబంధనలు, ఛార్జీలకు లోబడే క్యాన్సిలేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణ తేదీకి మూడు రోజుల ముదు వరకు.. పయాణ తేదీని ఉచితంగా (Go first republic offer Terms) మార్చుకోవచ్చు.

Also read: Royal Enfield new bikes: రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి అదిరే కొత్త బైక్​లు- పూర్తి వివరాలివే..

Also read: Todays Gold Price: తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News