BSNL Unlimited Plans: రూ.200 కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా

BSNL Unlimited Plans: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.200 లేదా అంతకంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా పొందవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 09:50 AM IST
BSNL Unlimited Plans: రూ.200 కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా

BSNL Unlimited Plans: దేశంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను అందిస్తోంది. మరోవైపు టెలికాం రంగంలో ఉన్న జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు గట్టిపోటీనిస్తుంది.

మార్కెట్లోకి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చి.. అనేక ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లు ప్రవేశపెడుతోంది. రూ.200 కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా పొందవచ్చు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

రూ.150 కంటే తక్కువ రీఛార్జులు

BSNLలో చౌకైన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ముందుగా వివరిస్తాం. ఈ ప్లాన్ వాలిడిటీ 22 రోజులు. ఇందులో మీకు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్ లో SMS, డేటా ప్రయోజనాలు రావు. 

రెండో అతి తక్కువ ప్లాన్ రూ.118.. దీనిలో మీకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 0.5GB రోజువారీ డేటా వస్తుంది. 26 రోజులు పాటు వ్యాలిడిటీ లభించనుంది. 

ఈ ప్లాన్ SMS మరియు డేటా ప్రయోజనాలతో రాదు. రెండవ ప్లాన్ రూ. 118, దీనిలో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, 0.5GB రోజువారీ డేటా మరియు 26 రోజుల పాటు కాలర్ ట్యూన్ సదుపాయాన్ని పొందుతారు. 

రూ.147 ధర కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 10GB హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్ తో పాటు BSNL నుంచి ఉచిత కాలర్ ట్యూన్ సదుపాయాన్ని పొందుతారు.

BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL ఇటీవలే మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రారంభించింది. అదే ధరకు గతంలో ఉన్న ప్రయోజనాలతో పాటు కొన్ని అదనంగా యాడ్ అవనున్నాయి. వాటి ధరలు రూ.184, రూ.185, రూ.186, రూ.187 ప్లాన్స్ ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB హైస్పీడ్ డేటా.. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకు 100 ఉచిత SMS లు ఈ రీఛార్జ్ లో లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి. 

(నోట్: దీని సమాచారం, ప్లాన్ కు సంబంధించిన పూర్తి ప్రయోజనాలను తెలుసుకునేందుకు మీ సమీపంలోని BSNL స్టోర్ లేదా వెబ్ సైట్ ను సందర్శించండి.) 

Also Read: Go first republic Day offer: గో ఫస్ట్​ రిపబ్లిక్​ డే ఆఫర్​- రూ.926కే విమాన టికెట్​!

Also Read: Royal Enfield new bikes: రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి అదిరే కొత్త బైక్​లు- పూర్తి వివరాలివే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News