New FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ ఇస్తున్న 4 బ్యాంకులు ఇవే
New FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. కష్టపడి సంపాదించిన సొమ్మును సురక్షితంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రిటర్న్స్ పొందే అవకాశముంది. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఏకంగా 8 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
New FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు ఇన్వెస్ట్‌పరంగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యుత్తమమైనవని చెప్పవచ్చు. ఇవి సురక్షితమే కాకుండా అద్బుతమైన రిటర్న్స్ అందిస్తాయి. తాజాగా దేశంలోని ఈ నాలుగు బ్యాంకులు ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీలో మార్పులు చేశాయి. సీనియర్ సిటిజన్లకైతే ఇంకా ఎక్కువ అందిస్తున్నాయి.
దేశంలోని నాలుగు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లలో డిసెంబర్ 2 నుంచి మార్పులు చేశాయి. ఇందులో పంజాబ్ సింధ్ బ్యాంకు, సీఎస్‌బి బ్యాంకు, ఇండస్‌ఇండ్, కేపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 8.25 శాతం వరకూ వడ్డీ ఇస్తున్నాయి. అందుకే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది సురక్షితమైన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాగలదు. డిసెంబర్ 2తో ముగిసిన వారంలో ఈ నాలుగు బ్యాంకులు ఎఫ్‌డి రేట్లను మార్చాయి.
పంజాబ్ సింధ్ బ్యాంక్
పంజాబ్ సింధ్ బ్యాంకు సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై అదనంగా 0.50, 0.15 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లుగా వర్గీకరించి ఇస్తోంది. డిసెంబర్ 1 రివిజన్ తరువాత 444 రోజుల గరిష్ట ఎఫ్‌డిపై వడ్డీ 7.40 శాతం ఉంది. ఇది 2024 డిసెంబర్ 1 వరకూ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 7.90 వడ్డీ అందుతుంది. ఏడాది కంటే తక్కువ వ్యవధికైతే సీనియర్ సిటిజన్లకు 6 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది. ఏడాది వరకూ ఎఫ్‌డిపై 6.70 శాతం వడ్డీ, ఏడాది దాటితే 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. 1 ఏడాది నుంచి 443 రోజులకు, 445 రోజుల్నించి 2 ఏళ్ల వరకూ, 3 -5 ఏళ్ల వరకూ ఎఫ్‌డిలకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. 2-23 ఏళ్ల కంటే ఎక్కువ కాల వ్యవధికి 6.80 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 5-10 ఏళ్ల కాల వ్యవధికి అయితే వడ్డీ 6.75 శాతం ఉంటుంది.
సీఎస్‌బి బ్యాంక్
సీఎస్‌బి బ్యాంక్ కూడా డిసెంబర్ 1 నుంచి వడ్డీ రేట్లను మార్చింది. ఆచార్య ఫిక్స్డ్ డిపాజిట్ పేరుతో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఎఫ్‌డి ఆఫర్ చేస్తోంది. 401 రోజుల కాల వ్యవధికి సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీ అందుకోవచ్చు. అదే 750 రోజులకైతే 7.10 వడ్డీ లభిస్తుంది. ఏడాదికిపైగా ఉంటే వడ్జీ 5.50 శాతం ఉంది. 1 ఏడాది నుంచి 400 రోజులు, 401 రోజుల్నించి 2 ఏళ్ల వరకూ కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డిలపై 6 శాతం వడ్డీ ఉంటుంది. 2 ఏళ్లు దాటి 750 రోజుల కంటే తక్కువకు, 750 రోజుల్నించి 5 ఏళ్ల వరకైతే 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 5-10 ఏళ్లకు అయితే సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్
ఇండస్‌ఇండ్ అందరికంటే అత్యధికంగా సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీపై 8.25 శాతం వడ్డీ అందిస్తోంది. సాధారణ ప్రజలకంటే 0.70 శాతం అధికంగా వడ్డీ ఇస్తోంది. 7-14 రోజుల ఎఫ్‌డి కూడా ఉంది. దీనిపై సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం వడ్డీ దొరుకుతుంది. అదే సాధారణ ప్రజానీకానికి ఇదే కాలపరిమితికి 3.50 వడ్డీ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఏడాది కాల వ్యవధి, 18 నెలల నుంచి 19 నెలలు, 19 నెలల్నించి 2 ఏళ్లు కాల పరిమితి కలిగిన ఎఫ్‌డిలకు 8.25 శాతం వడ్డీ ఇస్తోంది. అదే 2 ఏళ్ల నుంచి 61 నెలల వరకూ అయితే 8 శాతం వడ్డీ ఉంటుంది. 61 నెలలు దాటితే 7.75 శాతం వడ్డీ ఉంటుంది.
కేపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
కేపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 8.10 శాతం వడ్డీ అందిస్తోంది. అది కూడా సీనియర్ సిటిజన్లకు 400 రోజుల వరకూ. బ్యాంకు 12 నెలలు, 600 రోజులు, 900 రోజుల ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి.+ 12 నెలలకు 8 శాతం, 600 రోజులకు 7.90 శాతం, 900 రోజులకు 7.90 శాతం వడ్డీ ఇస్తోంది.
Also read: Aadhaar Update: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, పేరు మార్చాలంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook