Aadhaar Update: ఆధార్ కార్డులో ఇకపై తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం ద్వారా మార్చుకోవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, జెండర్, ఫోటో, బయోమెట్రిక్ మార్పు కోసం ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధార్ కార్డు మోడిఫికేషన్‌కు కొన్ని ప్రత్యేకమైన డాక్యుమెంట్లను మాత్రమే యూఐడీఏఐ గుర్తిస్తుంది. పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో మార్పులకు ఈ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
1. పాస్‌పోర్ట్
2. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపు పొందిన సంస్థలు జారీ చేసిన సర్వీస్ ఐడీ కార్డు
3. పెన్షనర్ ఫోటో ఐడెంటిటీ కార్డు లేదా ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్
4. మార్క్ షీటు లేదా గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూషన్ లేదా యూనివర్శిటీ జారీ చేసిన సర్టిఫికేట్
5. ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ చట్టం 2019 ప్రకారం జారీ చేసిన సర్టిఫికేట్
6. సంబంధిత కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ లేదా పంచాయితీ జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్
7. అధీకృత సంస్థ జారీ చేసే బర్త్ సర్టిఫికేట్‌తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం
డేటా యాక్యురేట్‌గా ఉండేందుకు పదేళ్లకోసారి అవసరమైన ధృవీకరణ పత్రాలతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. అదే సమయంలో ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ ప్రవేశపెట్టింది. మై ఆధార్ పోర్టల్‌లో ఈ ఉచిత అప్‌డేట్ సర్వీస్ డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుంది. నేరుగా ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేయించాలంటే 50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also read: Sim Card Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే 10 లక్షల జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Aadhaar Update: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, పేరు మార్చాలంటే ఏం చేయాలి