Gold and Silver Prices Today :  గత కొన్నాళ్లుగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారి పెరిగి అందరికీ షాకిచ్చాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ షురూ అయ్యింది. ఈ  నెలలో దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు ఉన్నాయి. గత మూడు నాలుగు నెలలుగా మంచి ముహుర్తాలు లేవు. దీంతో శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం మరింత తగ్గుతుందని ఆశపడిన వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ తగినట్లయ్యింది. బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. గత రెండు రోజుల్లో ఏకంగా 100 డాలర్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2431 డాలర్లు ఉంది. సిల్వర్ రేటు ఔన్సుకు 27.46 డాలర్లు ఉంది.హైదరాబాద్  లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై 820 పెరిగింది. 70,090వద్దకు చేరింది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 750కి పెరిగింది. తులం ధర రూ. 64, 240కి చేరింది. ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.  


Also Read : Hindenburg: అనుకున్నట్లే బాంబు పేల్చిన హిండెన్ బర్గ్.. సెబీ ఛైర్ పర్సన్ పై సంచలన ఆరోపణలు..!!


వెండి కూడా నాలుగు రోజుల్లో ఏకంగా 4500 పడిపోయింది. అయితే నేడు మళ్లీ పెరిగింది. వెండి ధర ఏకంగా 1500 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర రూ. 88వేల చేరింది. ఢిల్లీలో 83వేలు ఉంది. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వ్యాల్యూ పెరిగినా కొద్దీ బంగారం ప్యూరిటీ పెరుగుతుంది. మేలిమి బంగారాన్ని 24క్యారెట్లుగా చెబుతుంటారు. అంటే ఇది 99.9 స్వచ్చమైనది. ఇది కాయిన్స్ , బిస్కెట్లు, బార్స్ రూపంలో ఉంటుంది. నగల కోసం 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన గోడ్ల్ వినియోగిస్తారు. ఇందులో లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకున్న నగలన్నీ 22క్యారెట్ల 916 స్వచ్ఛతతో ఉంటాయి. బంగారం ధరను 91.6 కేడియం శాతంతో గుణిస్తారు. 


ఇక బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ధరలకు  అనుగుణంగా ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. తగ్గితే తగ్గుతుంది. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది.  


Also Read : Hydearabad:హైదరాబాద్ లో అక్కడ ఇల్లు కొన్నవాళ్లకు హడల్..ఏకంగా భవనాలనే కూల్చేస్తున్న సర్కార్..!!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి