Hindenburg Research : ట్విట్టర్లో శనివారం ఉదయం భారతదేశం గురించి సంథింగ్ బిగ్ అంటూ, హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ట్వీట్ ఎట్టకేలకు అర్థరాత్రి బాంబులా పేలింది. ఈసారి హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఏకంగా సెబి చైర్పర్సన్ ను టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేసింది. అదాని గ్రూప్ చేస్తున్న కుంభకోణంలో సెబీ చైర్ పర్సన్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ ఆమెకు సంబంధించిన ఆఫ్ షోర్ అకౌంట్లకు అదానీ గ్రూప్ కు ఉన్న సంబంధాన్ని విజిల్ బ్లోయర్స్ నివేదికల ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేసింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఈ సారి ఏకంగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్ పర్సన్ మధబి పూరీ బుచ్‌పై ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ ద్వారా జరిగిన ఆర్థిక అవకతవకలకు ఉపయోగించిన షాడో ఆఫ్‌షోర్ సంస్థలలో సెబీ చీఫ్‌కు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ తన కొత్త నివేదికలో పేర్కొంది.
విజిల్ బ్లోయర్స్ రూపొందించిన పత్రాలను ఆధారంగా చూపుతూ, హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మధాబి బుచ్, అలాగే ఆమె భర్త ధవల్ బుచ్‌కి ఆఫ్‌షోర్ ఫండ్‌లలో వాటాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. ఈ ఫండ్స్ లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారని కూడా ఆరోపించింది.
Also Read : FD vs RD : రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ మధ్య తేడా ఏంటి..?ఎందులో డబ్బు దాచుకుంటే లాభం.!!
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం, మాధబి బుచ్ అలాగే ఆమె భర్త ధవల్ బుచ్ జూన్ 5, 2015న సింగపూర్‌లో IPE ప్లస్ ఫండ్ 1తో తమ ఖాతాను తెరిచినట్లు పేర్కొంది. వీటిలో గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలోరి గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ పెట్టుబడి పెట్టినట్లు చూపారు. అలాగే మారిషస్‌లో రిజిస్టర్ చేసిన IPE ప్లస్ ఫండ్ 1లో పెట్టుబడి పెట్టినట్లు చూపించారు. అయితే దీనిపై సెబీ నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
బుచ్ తన షేర్లను 2022లో తన భర్తకు బదిలీ:
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏప్రిల్ 2017 నుండి మార్చి 2022 వరకు, మధాబి పూరీ బుచ్ SEBI పూర్తి-సమయ సభ్యుడు చైర్‌పర్సన్ అని ఆరోపించింది. సింగపూర్‌లోని అగోరా పార్టనర్స్ అనే కన్సల్టింగ్ సంస్థలో అతనికి 100 శాతం వాటా ఉంది. మార్చి 16, 2022న సెబీ చైర్‌పర్సన్‌గా ఆమె నియామకానికి రెండు వారాల ముందు, ఆమె తన షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసింది.
శనివారం ఉదయమే అలర్ట్:
అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, శనివారం ఉదయం X లో పోస్ట్ చేస్తూ, భారత్ త్వరలో ఏదో పెద్దది జరగబోతుందంటూ పోస్టు చేశారు. పోస్ట్‌లో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ "భారతదేశంలో త్వరలో ఏదో పెద్దది జరగబోతోంది.అన్నట్లుగానే సెబీ చైర్ పర్సన్ ను గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Hydearabad:హైదరాబాద్ లో అక్కడ ఇల్లు కొన్నవాళ్లకు హడల్..ఏకంగా భవనాలనే కూల్చేస్తున్న సర్కార్..!!
NEW FROM US:
Whistleblower Documents Reveal SEBI’s Chairperson Had Stake In Obscure Offshore Entities Used In Adani Money Siphoning Scandalhttps://t.co/3ULOLxxhkU
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి