Hydearabad Real Eastate : హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టిన ఆక్రమణల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా) హఫీజ్‌నగర్ లో ఈర్ల చెరువు బఫర్ జోన్ లో రోడ్ నెంబర్ 7 ప్లాట్ నెంబర్ 148, 149,150లో చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపుపై దృష్టి కేంద్రీకరించింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం హైడ్రా ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, జీహెచ్ఎంసీ సిబ్బంది పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు.
ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్యయంగా పర్యవేక్షించడం విశేషం. అయితే ప్రభుత్వం భూములను ఆక్రమించి అదే విధంగా చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. నగరంలో అక్రమ నిర్మాణాల వల్ల ప్రతి ఏటా వరదలు వస్తున్నాయని ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకే ముందు జాగ్రత్త చర్యగా నాళాల ఆక్రమణలు, చెరువుల బఫర్ జోన్ ఆక్రమణలను తొలగిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
అంతే కాదు రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లి లో కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమించి ప్లాట్లు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అలాగే గాజులరామారం ప్రాంతంలోని చింతలచెరువు బఫర్ జోన్ లో ఉన్న 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు దీంతో పాటు జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లేఅవుట్ పార్కు స్థలంలో కూడా అక్రమ నిర్మాణాలను తొలగించారు.
Also Read : Give Plastic Take Gold: ప్లాస్టిక్ ఇస్తే..బంగారు నాణేలు ఇస్తారు..ఎక్కడో తెలుసా?
#Hyderabad—3 fully constructed house are being demolished at Serilingampally-Vaishali Nagar.
Demolition of illegal structures and encroachments on lakes being take up at
Erla Cheruvu in Chandanagar and 10 acres recovered at Bum-Rukn-ud-Dowla Lake.As per NRSC data between… pic.twitter.com/Gu2FKUK8Sp
— @Coreena Enet Suares (@CoreenaSuares2) August 10, 2024
ఇదే తరహాలో వరసగా ఆక్రమణల తొలగింపు ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్తున్నారు. పార్కు స్థలాలు, చెరువులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.
శేరిలింగం పల్లిలో హైడ్రా ఉక్కుపాదం..ఈ ప్రాంతంలో ఇల్లు కొనడం సేఫేనా..?
ముఖ్యంగా శేరి లింగంపల్లిలో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు కారణంగా ఫ్లాట్ల కొనుగోలుదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భవన నిర్మాణదారులు అక్రమంగా చెరువులను కబ్జా చేసి వాటిపై అపార్ట్మెంట్లను నిర్మించి కస్టమర్లకు విక్రయించి చేతులు దులుపుకున్నారు. అయితే వీటిపై ప్రస్తుతం ప్రభుత్వం ముక్కు పాదం మోపుతుండటంతో కొనుగోలుదారులు వాపోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుపొందిన ఈ డివిజన్లో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిని గుర్తించి కూల్చివేతలు చేయడం కూడా ప్రభుత్వానికి సవాల్ గానే ఉంది.
అయితే అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేవారు కచ్చితంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని రియల్టర్లు సూచిస్తున్నారు. అలాగే అయ్యప్ప సొసైటీ కూడా గతంలో ఇలాంటి వివాదం లోనే ఇరుక్కుంది ప్రస్తుతం కూడా ఈ ప్రాంతంలో ఉన్న అనేక నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు గా ఉన్నాయి. ఇలాంటి ఆస్తులను కూడా కొనుగోలు చేసిన వారు బిక్కుబిక్కుమంటున్నారు. అందుకే నగరంలో ఆస్తులు కొనుగోలు చేసేవారు అటు కమర్షియల్ గాని రెసిడెన్షియల్ గాని పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు కచ్చితంగా అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేస్తున్నామా లేదా అన్న విషయాలను లీగల్ అడ్వైజర్ల ద్వారా, లేదా రెవెన్యూ అధికారుల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకొని కొనుగోలు చేస్తే మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కేసు..ఆగస్టు 11కు తీర్పు వాయిదా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి