Gold-Silver Rates Today : ఆగష్టు 21వ తేదీ బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది. గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో పసిడి ధరలలో కొంత మార్పు చూడవచ్చు. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్‌ లో ఈ రోజు 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయలు తగ్గాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో తులం బంగారం ధర 24 క్యారట్ల  పది గ్రాముల బంగారం ధర రూ. 72650 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారట్ల  పది గ్రాముల గోల్డ్ ధర  రూ. 66,600 వద్ద ఉంది. బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ ఇది చాలా స్వల్పం అని గుర్తించాల్సి ఉంటుంది. గత వారంతో పోల్చి చూసినట్లయితే బంగారం ధరలు దాదాపు 3 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధర మరొక 2000 రూపాయలు పెరిగింది అంటే ఆల్ టైం రికార్డు స్థాయిని దాటుతుంది. బంగారం ధరల  ఆల్ టైం గరిష్ట రికార్డు స్థాయి 75 వేల రూపాయల పైన ఉంది. బంగారం ధరలు త్వరలోనే రికార్డు స్థాయిని నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Also Read : Nita Ambani Gift: నీతా అంబానీకి చిన్న కోడలు అంటేనే ఇష్టమా..పెద్ద కోడలు కన్నా చిన్నకోడలికే.. అత్యంత ఖరీదైన గిఫ్ట్  


మరోవైపు అంతర్జాతీయంగా ధరలను గమనించినట్లయితే అమెరికాలో ఒక ఔన్స్ అంటే సుమారు 31 గ్రాముల బంగారం ధర 2500 డాలర్లు దాటేసింది. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దేశీయంగా బంగారం ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో దిగుమతి సుంకాలను భారీగా తగ్గించింది అయినప్పటికీ బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. బంగారం ధరలు  భారీగా పెరగడం వెనక ఈసారి చైనా కూడా పరోక్షంగా కారణం కనిపిస్తోంది.   


చైనా సెంట్రల్ బ్యాంక్ అమెరికా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే గడిచిన 18 నెలలుగా చైనా ఎడాపెడ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న బంగారాన్ని కొనుగోలు చేస్తుంది.అయితే గత జూన్ నెల నుంచి మధ్యలో బ్రేక్ ఇచ్చింది.కానీ మళ్ళీ ఆగస్టు నెలలో  చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు మళ్ళీ ప్రారంభించింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని వార్తలు రావడం కూడా బంగారం మార్కెట్ కు సానుకూలమైన వార్త అని చెప్పవచ్చు దేశీయంగా కూడా పెరిగేందుకు బంగారానికి అవకాశం లభించింది.


Also Read : Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి