Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర... ఈసారి ఎంత తగ్గిందంటే...
Gold Price Today June 11th 2022 : బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4775గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5210గా ఉంది.
Gold Price Today June 11th, 2022 : బంగారం ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.210 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 నుంచి రూ.47,750కి దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310 నుంచి రూ.52,100కి దిగొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం (జూన్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా.. ప్రస్తుత ధర రూ.47,750గా ఉంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310 ఉండగా... ఇప్పుడది రూ.51,100కి దిగొచ్చింది.
ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.52,100గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100గా ఉంది.
పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,130గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది.
దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించుగా ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
Also Read: Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపు...
Also Read: PRESIDENT ELECTION 2022: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook