Gold Price Today August 5: బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఓరోజు రేట్లు పెరిగితే, మరో రోజు తగ్గుతాయి, ఇంకోరోజు మాత్రం స్థిరంగా ఉంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా.. తగ్గినా వ్యాపారం మాత్రం జోరుగానే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. 4-5 రోజులు క్రితం స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. రెండు రోజులుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (ఆగష్టు 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,500లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,820లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 350.. 24 క్యారెట్ల ధరపై రూ. 380 పెరిగాయి.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,980గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,820గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,640 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,550.. 24 క్యారెట్ల ధర రూ. 51,880గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,280గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,820గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,500.. 24 క్యారెట్ల ధర రూ. 51,820గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,820 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 57,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 63,200లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 63,200లుగా కొనసాగుతోంది. 


Also Read: Horoscope Today August 5th : నేటి రాశి ఫలాలు.. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ రాశి వారు మోసపోయే ప్రమాదం..  


Also Read: Comedian Raghu's father death: జబర్ధస్త్ కమెడియన్ రఘు తండ్రి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook