Comedian Raghu father's death: ప్రముఖ హాస్యనటుడు రఘు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కారుమంచి రఘు తండ్రి వెంకట్ రావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏళ్లు. వెంకట్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలతోనే గురువారం ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలదించిన వెంకట్ రావు.. పదవీ విరమణ పొందిన తర్వాత ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు.
హాస్య నటుడిగా అనేక చిత్రాల్లో నటించిన రఘుకి అదుర్స్ సినిమా కమెడియన్‌గా మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఆ తర్వాత జబర్ధస్ట్ కామెడీ షోలోనూ కమెడియన్‌గా చేసి మరోసారి ఆడియెన్స్ మెప్పుపొందిన సంగతి తెలిసిందే. తండ్రి వెంకట్ రావు మృతితో శోకసంద్రంలో ఉన్న రఘు కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, మిత్రులు తమ సంతాపం ప్రకటించారు. రఘు తండ్రి వెంకట్ రావు మృతి వార్త తెలుసుకున్న అతడి సన్నిహిత మిత్రులు ఒక్కొక్కరిగా అతడి ఇంటికి చేరుకుని రఘుకు ధైర్యం చెప్పి ఓదారుస్తున్నారు.
Also Read : Manchu Vishnu: వారినే సినిమాల్లోకి తీసుకోండి.. నిర్మాతలకు మంచు విష్ణు విన్నపం!
Also Read : Hansika Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ హన్సిక..వరుడు ఎవరో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android App link : https://bit.ly/3SDTkY7
iOS App link : https://apple.co/3BL64G7