Gold Price Today 27th December 2020: ఈ నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగొచ్చాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా లాక్‌డౌన్ నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నేడు సైతం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,940గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.80 మేర తగ్గడండంతో 10 గ్రాముల ధర రూ.46,690కి పతనమైంది.


Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే  



దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price Today) ఇటీవల దిగొస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర నిన్నటిలాగే రూ.53,180 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై ధరలో సైతం ఏ మార్పు లేదు. గత రెండు రోజుల మాదిరిగానే ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.48,750 వద్ద స్థిరంగా ఉంది.


Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి



బులియన్ మార్కెట్‌లో డిసెంబర్‌ తొలి అర్ధభాగంలో భారీగా పెరిగిన వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. అయితే ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడో రోజులు తగ్గిన వెండి ధర తాజాగా పెరిగింది. తాజాగా రూ.1,010 మేర పెరగడంతో ఢిల్లీ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.71 వేల మార్కులో ట్రేడ్ అవుతోంది. తాజాగా రూ.200 మేర దిగిరావడంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,200కి క్షీణించింది.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook