Todays Gold Rate: బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఇవి కాకుండా కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్ల బంగారం నిల్వ, వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వే 450 రూపాయలుంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 450 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 950 రూపాయలుంది.


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు అయితే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 


Also read: Credit Debit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఖాతా నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి పొందవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.