Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకునే మార్పుల కారణంగా ధరల పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై 6 వందల రూపాయలు, 24 క్యారెట్ల బంగారంపై 7 వందల రూపాయలు బంగారం ధర తగ్గింది. ఫలితంగా దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు పరిశీలిద్దాం..


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,154 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,440 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51, 230 రూపాయులంది. అత్యధికంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,400 ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,230 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,050 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,330 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,230 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధఘర 51,230 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Also read: Todays Fuel Price: ఇవాళ ఆగస్టు 24 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook