Gas Cylinder Prices: గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ ధర, ఇవాళ్టి నుంచి అమలు
Gas Cylinder Prices: ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ్టి నుంచి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మారిన ధరల ప్రకారం గ్యాస్ సిలెండర్ రేటు ఇలా ఉంది.
Gas Cylinder Prices: ప్రతి నెలా సమీక్షించినట్టే ఈ నెల చమురు కంపెనీలు గ్యాస్ ధరలపై మరోసారి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మారిన కొత్త ధరల వివరాలు మీ కోసం..
ఇంధన ధరలు అంటే పెట్రోల్-డీజిల్ ధరలు రోజురోజుకూ మారుతున్నట్టే గ్యాస్ ధరలు నెలకోసారి మారుతుంటాయి. ఇప్పుడు మరోసారి సమావేశమైన చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధరపై 171.50 రూపాయలు తగ్గింది. గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల డొమెస్టిక్ సిలెండర్ ధర యధాతధంగా కొనసాగుతోంది. డొమెస్టిక్ గ్యాస్ ధరలు మారలేదు.
ఇటీవలి కాలంలో వరుసగా మూడు పర్యాయాలుగా పెరుగుతూ వస్తున్న కమర్షియల్ గ్యాస్ ధర ఈసారి తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. 2021 నవంబర్, డిసెంబర్ నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 369.50 రూపాయలు పెరిగింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర ఏకంగా 2000 దాటేసింది. 2022 మార్చ్ నెలలో కమర్షియల్ సిలెండర్ ధర 100 రూపాయలు పెరగగా, ఏప్రిల్ 1వ తేదీన 250 రూపాయలు పెరిగింది.
తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఒక్కొక్క సిలెండర్ ధరను 171.50 రూపాయలు తగ్గించింది. తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 1856.50 రూపాయలు కాగా, ముంబైలో 1808.59 రూపాయలకు చేరుకుంది. కోల్‌కతాలో 1960.50 రూపాయలైంది. చెన్నైలో గరిష్టంగా 2021 రూపాయలుంది.
Also read: EPF Money For Marriages: పెళ్లి కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొచ్చా ? ఏం చేయాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo