Google Pay: ప్రముఖ యూపీఐ వేదిక గూగుల్ పేకు సంబంధించి గూగుల్ సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలో అంటే 2024 జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు నిలిపివేయనున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. అసలీ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ పే సేవల్ని నిలిపివేయనున్నట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. అయితే ఇది ఇండియాలో కాదు. అమెరికాలో గూగుల్ పే సేవలు మూతపడనున్నాయి. ఇండియా, సింగపూర్ దేశాల్లో గూగుల్ పే సేవలు యధావిధిగా కొనసాగనున్నాయి. ఇండియాలో యూపీఐ యాప్‌లలో మొదటి స్థానం ఫోన్ పే కాగా రెండో స్థానంలో గూగుల్ పే ఉంది. అదే సమయంలో ఇండియాలో యూపీఐ పేమెంట్లు చాలా అధికం. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే యూపీఐ చెల్లింపులు అధికంగా జరుగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు అసాధారణంగా పెరిగాయి. 


గత ఏడాది డిసెంబర్ 11 నాటికి 8,572 కోట్ల మేర యూపీఐ చెల్లింపులు జరిగాయి. 2017-18లో 92 కోట్లు మాత్రమే ఉంది. ఇక వాల్యూమ్‌పరంగా పరిశీలిస్తే యూపీఐ చెల్లింపులు 2017-18లో 1 లక్ష కోట్లుంటే..2022-23 ఆర్ధిక సంవత్సరంలో 139 లక్షల కోట్లకు చేరుకుంది. 


అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వ్యాలెట్ చెల్లింపులు, వినియోగం ఈ మధ్యకాలంలో అధికమైంది. అందుకే ఆ దేశంలో గూగుల్ పే సేవల్ని మూసివేసి గూగుల్ వ్యాలెట్ సేవల్ని కొనసాగించాలని కంపెనీ నిర్ణయించింది. ఇకపై అమెరికాలో గూగుల్ పే సేవలు మరో మూడు నెలలు మాత్రమే పనిచేయనున్నాయి. ఆ తరువాత గూగుల్ వ్యాలెట్ సేవలే అందుతాయి.


Also read: Policy Porting: హెల్త్ పాలసీ పోర్టింగ్ అంటే ఏమిటి, కలిగే ప్రయోజనాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook