Hero Pleasure Xtec Price: మోటార్ సైకిల్ కంపెనీ హీరో తమ కస్టమర్స్‌కి మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన కొత్త స్కూటీని మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీనిని కంపెనీ కొత్త హీరో ప్లెజర్ ప్లస్ xtec స్పోర్ట్స్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త స్కూటర్ ప్లెజర్ ప్లస్ లైనప్‌లో కస్టమర్స్ కి లభించబోతోంది. ఇప్పటికీ ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన అన్ని వివరాలను హీరో వెల్లడించింది. ఈ స్కూటీ భారత మార్కెట్లో ధర రూ. 79,738 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమైంది. ఈ స్మార్ట్ స్కూటర్ ప్రత్యేకమైన బ్లూటూత్ కనెక్టివిటీ తో కొత్త రంగులో మార్కెట్లోకి వచ్చింది. అంతేకాకుండా కంపెనీ తమ ఆకర్షించేందుకు కొత్త గ్రాఫిక్స్‌తో ఈ బైకు పరిచయం చేసింది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ హీరో ప్లెజర్ ప్లస్ xtec స్కూటర్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ కలర్, స్కీమ్ నీలం రంగును ప్రైమరీ షేడ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు సైడ్ ప్యానెల్‌లు, ఫ్రంట్ ఆప్రాన్ సెటప్‌తో లభిస్తోంది. కొత్త వేరియంట్ స్టాండర్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 110.9cc ఇంజన్‌తో పనిచేయడమే కాకుండా 8bhp శక్తిని, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్ స్కూటర్ 4.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో లభిస్తోంది. ఈ స్కూటర్ బరువు విషయానికొస్తే, 106 కిలోల బరువును కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీంతోపాటు అనేక శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్కూటర్ మార్కెట్లో లభిస్తోంది.


బ్లూటూత్ కనెక్టివిటీ:
ఈ శక్తివంతమైన హీరో ప్లెజర్ ప్లస్ xtec స్కూటర్ డిజైన్‌లో భాగంగా ప్లెజర్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్లెజర్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్కులు కూడా ఉంటాయి. అలాగే ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ల్యాంపులతో పాటు సెమీ డిజిటల్ కన్సోల్‌ను కూడా కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఎస్ఎంఎస్ ఇండికేషన్స్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. ఇక ఈ స్కూటర్ బ్రేక్ సిస్టం విషయానికొస్తే, డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ భారత మార్కెట్లో హోండా యాక్టివా 6జి తోపాటు టీవీఎస్ జూపిటర్‌తో త్వరలోనే పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.


హీరో ప్లెజర్ ప్లస్ Xtec టాప్ ఫీచర్స్:
బ్లూటూత్ కనెక్టివిటీ: మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవ్వడానికి, డ్యాష్‌బోర్డ్‌లో కాల్‌లు, సందేశాలను చూడటానికి సహాయపడుతుంది.
LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్: రాత్రిపూట మెరుగైన దృశ్యమానతను అందిస్తుంది.
i3S టెక్నాలజీ: ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.
క్రోమ్ మిర్రర్లు: స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.
స్పోర్టీ స్ట్రైప్డ్ థీమ్: స్కూటర్‌కు ఒక స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది.
USB చార్జింగ్ పోర్ట్: మీ ఫోన్‌ను చార్జ్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్: ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, ఇంజన్ దెబ్బతినకుండా కాపాడటానికి ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది.
ఎక్స్‌టెండెడ్ ఫుట్‌రెస్ట్: మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
20.4 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్: హెల్మెట్, ఇతర వస్తువులను పెట్టుకోవడానికి తగినంత స్థలం.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


అదనపు ఫీచర్స్:
డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
టెలిస్కోపిక్ ఫోర్క్‌లు
10-అంగుళాల అల్లాయ్ వీల్‌లు
220 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ (ZX వేరియంట్‌లో మాత్రమే)


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి