How Much Cash Can you Store at Home: ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్‌ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా నగదును బ్యాంక్‌ అకౌంట్‌లలోనే ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు నగదును ఇంట్లో ఉంచడం బాగా తగ్గించారు. మన తాతయ్యల కాలంలో నగదు ఇంట్లో దాచుకోమని పెద్దలు చెప్పేవారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఇంట్లో నగదు ఉంటే ఉపయోగపడుతుందని చెప్పేవారు. అంతకుముందు కూడా బ్యాంకుల్లో డబ్బులు జమ చేసేందుకు అంగీకరించని సమయంలో వచ్చిన సొమ్మును ఇళ్లలోనే దాచుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రజలు ఆర్థిక లావదేవిలకు డిజిటల్ వాలెట్‌ను వాడుతున్నారు. అయితే ఇంట్లో ఎంతవరకు నగదు దాచుకోవచ్చో మీకు తెలుసా..? డబ్బు ఇంట్లో ఎక్కువ ఉంటే జరిమానా ఉంటుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. ఇంట్లో నగదు ఉంచుకోవడంపై లిమిట్ ఉంది. మీ ఆదాయానికి తగినంత డబ్బులు ఉండాలి. ఐన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసిన సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే.. దానికి తగిన లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఆ డబ్బుకు ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో అన్ని వివరాలను ఆదాయపన్ను శాఖకు అందజేయాలి. ఇంట్లో ఉన్న నగదు గురించి ఐటీఆర్ పొందుపరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందుకు సంబంధించిన పత్రాలను దాచి పెట్టుకుని.. అధికారులు అడిగిన సమయంలో అందజేయండి. 


మీరు ప్రతి సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేస్తే.. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ ఇంట్లో నగదు మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రకారమే ఉండాలి. ఐటీఆర్ ఫైల్‌ చేయకపోతే మీ ఇంట్లో ఉంచిన నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 137 శాతం వరకు ట్యాక్స్ విధిస్తుంది. అంటే  మీ నగదుతో పాటు 37 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో దాచుకునే నగదు పరిమితిపై లిమిట్ లేదు గానీ.. ఎంత డబ్బు ఉన్నా దానికి లెక్కలు కచ్చితంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


Also Read: Bhuma Akhila Priya Reddy Arrest: టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్  


Also Read: Pawan Kalyan: 'పాపం పసివాడు..' అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి