Mobile Tower Installation: రజనీకాంత్ స్టైల్లో చెప్పాలంటే.. ఈ రోజుల్లో మొబైల్ లేని ఇళ్లు లేదు.. సెల్‌ఫోన్ వాడని మనిషే లేడు.. ఈ రెండు జరగని ఊరే లేదు.. అవును ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరి అయింది. స్కూల్‌కు వెళ్లే పిల్లోడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిపోయారు. కొంతమంది రెండు మూడు సెల్‌ఫోన్లు యూజ్ చేస్తుంటారు. మొబైల్ వాడకం ఎక్కువ కావడంతో సెల్‌ఫోన్స్‌ టవర్స్ కూడా ఎక్కువగా నిర్మించాల్సి వస్తోంది. 2024 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో మొబైల్ టవర్లు ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సంబంధిత శాఖలకు సూచించారు. ఈ నేపథ్యంలో మీరు స్థలంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయించుకుని నెలకు అద్దె రూపంలో డబ్బులు సంపాదించుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన దేశంలో మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసి నిర్వహించే అనేక కంపెనీలు ప్రస్తుతం చాలానే ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో కూడా లిస్ట్ అయ్యాయి. ఇండస్ టవర్స్, జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, టాటా కమ్యూనికేషన్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, టాటా టెలిసర్వీసెస్, తేజస్ నెట్‌వర్క్స్, టవర్ విజన్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐటీఐ లిమిటెడ్, టాటా టెలిసర్వీస్ లిమిటెడ్, టాటా టెలిసర్వీస్ లిమిటెడ్ తదితర కంపెనీలు మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. 


దేశంలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ మరింత పటిష్టంగా మారేందుకు మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. టవర్ల ఏర్పాటుకు భూమి లేదా తమ ఇంటి పై కప్పులో స్థలం ఇచ్చిన వారికి టెలికాం సంస్థలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నాయి. ఎక్కడైనా టవర్లు ఏర్పాటు చేసిస్తే.. నెలవారీ అద్దెను టవర్లను ఏర్పాటు చేసే కంపెనీలు చెల్లిస్తాయి. గ్రామం, నగరం, మెట్రో నగరాన్ని బట్టి రెంట్‌ను నిర్ధారిస్తారు. అయితే టవర్ ఏర్పాటు చేసిన లొకేషన్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.60 వేల వరకు అద్దెను చెల్లిస్తారు.


మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం మీ భూమిని అద్దెకు ఇవ్వడానికి టీఎస్‌పీలను నేరుగా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో ఇండస్ టవర్, వియోమ్ రిట్ల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, అమెరికన్ టవర్ కార్పొరేషన్‌లను ఎంచుకోవచ్చు. గతంలో ఈ కార్పొరేషన్లు అనేక దేశాలలో టవర్ అభివృద్ధి కార్యక్రమాలకు బాధ్యత వహించాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వెబ్‌సైట్‌ను సందర్శించి.. మొబైల్ టరవ్ ఏర్పాటు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అయితే రేడియో ఫ్రీక్వెన్సీ పరంగా మీ భూమి ఆమోదయోగ్యమైనట్లయితే మాత్రమే సంస్థలు మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేస్తాయి.సైట్‌కు గ్రీన్ సిగ్నల్ వస్తే.. కొన్ని అవగాహన ఒప్పందాలు (MOU) సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు లీజుకు ఇవ్వాలి.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   


Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook