Income Tax Refund Alert: ఆదాయపు పన్ను రిఫండ్ అలర్ట్, మీ కోసం CBDT కీలక ప్రకటన
ITR Refund Status: చెల్లింపుదారులకు వచ్చేసింది. అయితే ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 తేదీల మధ్య మొత్తం 2.38 కోట్ల మందికి రూ. 2.62 లక్షల కోట్ల రూపాయాలను ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్(ITR) విడుదల చేసింది.
ITR Refund Status: ఆదాయపు పన్నుపై వసూళ్లు చేపట్టడంతో పాటు వసూలు చేసిన పన్నులపై రిఫండ్ సైతం పన్ను చెల్లింపుదారులకు వచ్చేసింది. అయితే ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 తేదీల మధ్య మొత్తం 2.38 కోట్ల మందికి రూ. 2.62 లక్షల కోట్ల రూపాయాలను ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్(ITR) విడుదల చేసింది. తద్వారా రెండున్నర లక్షల మంది దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు తమ రిఫండ్ వివరాలను ఆన్‌లైన్ ద్వారా సులువుగా స్టేటస్ తెలుసుకోవచ్చు.
గత ఆర్థిక సంవత్సరం రూ.1.83 లక్షల కోట్లు ఐటీఆర్ రిఫండ్ విడుదల చేయగా, 43.2 శాతం అధికంగా పన్ను చెల్లింపుదారులకు తిరిగి జమచేశారు. 2.3 కోట్ల కేసులలో వ్యక్తిగత ఆదాయపు పన్ను కింద రూ.87,749 జారీ చేయగా, కార్పొరేట్ పన్నుల కింద రూ.1.74 లక్షల కోట్ల రూపాయాలను రిఫండ్ చేసింది. మొత్తం 3,46,164 కార్పొరేట్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చెల్లింపుల రిఫండ్ (ITR Refund) నగదు ఖాతాల్లో జమ కానుంది.
Also Read: Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్, తొలి రోజు నుంచే సేవలకు అంతరాయం
ఐటీఆర్ రిఫండ్‌పై ఆర్థికశాఖ ప్రకటన విడుదల చేసింది.‘ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21 ఏడాదిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాం. కోవిడ్-19(COVID-19) మహమ్మారి కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలలో సైతం ఇదే సరిస్థితి నెలకొంది. సమయానుసారం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఆదాయపు పన్ను రిఫండ్ అందించారు.
కాగా, పాన్ కార్డ్, ఆధార్ కార్డుల అనుసంధానికి తుది గడువును సైతం ఇటీవల మరోసారి పొడిగించారు. మార్చ 31తో ముగియనున్న తుది గడువును జూన్ 30, 2021కి పొడిగించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook