Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్, తొలి రోజు నుంచే సేవలకు అంతరాయం

Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 30, 2021, 12:34 PM IST
  • మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది
  • ఏప్రిల్ నెలలో రిజర్వ్ బ్యాంక్ పనిదినాలు, సెలవులు
  • నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు
Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్, తొలి రోజు నుంచే సేవలకు అంతరాయం

మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.

ఏప్రిల్ నెలలో ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, జగ్జీవన్‌రామ్ జయంతి, బిహు లాంటి పండుగలు ఉన్నాయి. దాదాపు 15 రోజులపాటు ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులలో కొంత మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 1(New Rules From April 1)న బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ కనుక ఆ రోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. నెల తొలి రోజు నుంచే ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని గమనించి తమ పనులు ప్లాన్ చేసుకోవాలి.

Also Read; ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

ఏప్రిల్ 2021లో బ్యాంకు సెలవు దినాలు ఇవే:
- ఏప్రిల్ 1 - గత ఏడాది అకౌంట్ క్లోజింగ్
- ఏప్రిల్ 2 - గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 4 - ఆదివారం
- ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
- ఏప్రిల్ 10 - రెండో శనివారం
- ఏప్రిల్ 11 - ఆదివారం 
- ఏప్రిల్ 13 - తెలుగు సంవత్సరాది, ఉగాది పండుగ
- ఏప్రిల్ 14 - బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి/ తమిళ  సంవత్సరాది/ బీజు పండుగ
- ఏప్రిల్ 15 - హిమాచల్ డే/ బెంగాలీ నూతన సంవత్సరాది/ బోహగ్ బిహూ / సార్హుల్
- ఏప్రిల్ 16 - బోగాహ్ బిహూ
- ఏప్రిల్ 18 - ఆదివారం
- ఏప్రిల్ 21 - శ్రీరామనవమి  / గరియా పూజ
- ఏప్రిల్ 24 - నాలుగో శనివారం
- ఏప్రిల్ 25 - ఆదివారం

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News