ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి రెండు విధానాలున్నాయి. రెండింట్లో ఓల్డ్ ఇన్‌కంటాక్స్ విధానమైతే..ఇన్‌కంటాక్స్‌లో కొంత మినహాయింపు ఉంటుంది. అయితే మార్చ్ 31లోగా ఇన్‌కంటాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు సమర్పించకపోతే ట్యాక్స్ మినహాయింపు వర్తించదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చ్ 31న 2022-23 ఆర్ధిక సంవత్సరం సమాప్తం కానుంది. ఈ క్రమంలో మార్చ్ 31లోగా పూర్తి చేయాల్సినవి తక్షణం చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ మినహాయింపు సైతం అప్పుడే లభిస్తుంది. ఇన్‌కంటాక్స్ ప్రకారం ప్రస్తుతం రెండు ట్యాక్స్ విధానాలున్నాయి. ఓల్డ్ ట్యాక్స్ విధానం, న్యూ ట్యాక్స్ విధానం. ఎవరైనా పాత ట్యాక్స్ విధానం కింద ట్యాక్స్ దాఖలు చేస్తే కొన్ని ట్యాక్స్ మినహాయింపులు కూడా వర్తిస్తాయి. అయితే ఈ మినహాయింపులు వర్తించాలంటే మార్చ్ 31లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 


2022-23 ఆర్ధిక సంవత్సరం కోసం ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ గడువు మార్చ్ 31 వరకూ ఉంది. ట్యాక్స్ తగ్గించేందుకు, ఎక్కువ డబ్బులు ఆదా చేసేందుకు అనుమతిస్తుంది. పాత ట్యాక్స్ విదానంలో ట్యాక్స్ మినహాయింపు పొందాలంటే..మార్చ్ 31 లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 


ఒకవేళ ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి లేదా 80 డి ప్రకారం ప్రయోజనం పొందేందుకు ఏ విధమైన ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోతే మార్చ్ 31లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చ్ 31 తరువాత ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రయోజనం 2022-23 ఇన్‌కంటాక్స్ దాఖలుకు వర్తించదు.


Also read: Adani Group: అదానీ గ్రూప్ కీలక అప్‌డేట్, ఆరు అనుబంధ కంపెనీల విలీనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook