Adani Group: అదానీ గ్రూప్ కీలక అప్‌డేట్, ఆరు అనుబంధ కంపెనీల విలీనం

Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అదానీ గ్రూప్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయినా కంపెనీ షేర్లు ఇంకా క్షీణిస్తూనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ మార్కెట్ వాటా 60 శాతానికి పైగా పడిపోయింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2023, 09:39 AM IST
Adani Group: అదానీ గ్రూప్ కీలక అప్‌డేట్, ఆరు అనుబంధ కంపెనీల విలీనం

మరోవైపు అదానీ గ్రూప్ నుంచి మరో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. అదానీ గ్రూప్‌కు చెందిన 6 అనుబంధ కంపెనీలను అదానీ పవర్‌తో విలీనం చేయడం కీలక పరిణామం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సైతం ఈ విలీనాన్ని ఆమోదించింది. ఆదానీ పవర్‌లో 6 అనుబంధ కంపెనీల విలీనం ఎలా ఉండనుంది, ఆ వివరాలేంటనేది తెలుసుకుందాం..

అదానీ పవర్

అదానీ గ్రూప్ ఆధిపత్యంలోని ఆరు అనుబంధ సంస్థల్ని పూర్తి స్థాయిలో అదానీ పవర్ లిమిటెడ్‌లో విలీనం చేశామని బీఎస్ఈకు అదానీ గ్రూప్ సూచించింది. ఇందులో అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్, అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్, ఉడుపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, రాయ్‌పూర్ ఎనర్జదీ లిమిటెడ్, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్, అదానీ పవర్ ఉన్నాయి. 

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ విభాగం ఫిబ్రవరి 2023న ఈ కంపెనీలను అదానీ పవర్ లిమిటెడ్‌లో విలీనానికి ఆమోదం తెలిపింది. ఈ విలీనం కార్యరూపం దాల్చేందుకు అవసరమైన షరతులన్నీ పూర్తయ్యాయి. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  జనవరి 24 అదానీ గ్రూప్‌పై ఆర్ధిక మోసాలు, షేర్ల అవకతవకల ఆరోపణలు చేసింది.

అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఈ రిపోర్ట్ వెలువడిన తరువాత అదానీ గ్రూప్ వాటా 60 శాతానికి పైగా పడిపోయింది. గత వారం నుంచి షేర్ల ధరల్లో పురోగతి కన్పిస్తుంది. అదానీ పవర్‌లో ఆరు అనుబంధ కంపెనీల విలీనం ప్రభావం షేర్ మార్కెట్‌పై ఎలా ఉంటుందనేది ఆసక్తి కల్గిస్తోంది. అదానీ గ్రూప్ షేర్లలో పురోగతి కన్పించవచ్చనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. 

Also read: Hyundai Alcazar 2023: హ్యూందాయ్ నుంచి సూపర్ పవర్‌ఫుల్ కారు వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News