Vande Bharat Trains: మరో మైలురాయిని దాటిన వందేభారత్ రైళ్లు, గంటకు 180 కిలోమీటర్ల వేగం
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. వందేభారత్ రైళ్లు కొత్త మైలురాయిని అందుకున్నాయి. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ ద్వారా వివరాలు అందించారు.
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. వందేభారత్ రైళ్లు కొత్త మైలురాయిని అందుకున్నాయి. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ ద్వారా వివరాలు అందించారు.
భారతీయ రైల్వేకు ఇదొక గుడ్‌న్యూస్. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి గుడ్‌న్యూస్ వెలువడింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లు కొత్త మైలురాయిని అందుకున్నాయి. వందేభారత్ రైళ్లు పరీక్ష సందర్భంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి వీడియో కూడా షేర్ చేశారు.
వందేభారత్-2 రైళ్ల స్పీడ్ ట్రయల్ కొనసాగుతోందని..ఇందులో కొత్త మైలురాయిని అందుకున్నట్టు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ట్రయల్‌ను కోటా-నాగదా సెక్షన్ల మధ్య పరీక్షించగా..గంటకు 120, 130, 150..180 కిలోమీటర్ల వేగాన్ని దాటాయని చెప్పారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ రైళ్లు వేగాన్నిపెంచుకున్నాయి. ప్రస్తుతం ట్రైన్ -18 దాదాపుగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్ధ్యాన్ని పొందాయి.
రైల్వే అందించిన సమాచారం మేరకు ఈ రైళ్లు చాలా ప్రత్యేకంగా నిర్మించారు. ట్రయల్ కూడా హై లెవెల్‌లో పరీక్షిస్తున్నారు. ట్రైన్ స్పీడ్ ట్రయల్ తొలిదశలో 110 కిలోమీటర్లకు విజయవంతమైన తరువాత కోటా-నాగదా సెక్షన్ మధ్య రెండవ దశ ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇందులో గరిష్ట వేగం 180 కిలోమీటర్లు అందుకుంది.
2023 నుంచి 75 వందేభారత్ రైళ్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన మేరకు 2023 ఆగస్టు 15 వరకూ దేశంలో 75 వందేభారత్ రైళ్లు ప్రారంభమౌతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐసీఎఫ్‌కు నెలకు 6-7 వందేభారత్ రైళ్లు ఉత్పత్తి చేసే సామర్ధ్యముంది. ఈ సంఖ్యను 10కు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also read: LIC New Schemes: రిటైర్మెంట్ తరువాత సెక్యూరిటీ, ఎల్ఐసీలో కొత్త పధకం వివరాలు ఇవీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook