LIC New Schemes: రిటైర్మెంట్ తరువాత సెక్యూరిటీ, ఎల్ఐసీలో కొత్త పధకం వివరాలు ఇవీ..

LIC New Schemes: ఉద్యోగస్థులకు తరచూ ఎదురయ్యే ప్రశ్న..రిటైర్మెంట్ తరువాత పరిస్థితి ఏంటని. అందుకే ఎల్ఐసీ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి మీకు జీవితాంతం..పెన్షన్ అందిస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2022, 06:22 PM IST
LIC New Schemes: రిటైర్మెంట్ తరువాత సెక్యూరిటీ, ఎల్ఐసీలో కొత్త పధకం వివరాలు ఇవీ..

LIC New Schemes: ఉద్యోగస్థులకు తరచూ ఎదురయ్యే ప్రశ్న..రిటైర్మెంట్ తరువాత పరిస్థితి ఏంటని. అందుకే ఎల్ఐసీ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి మీకు జీవితాంతం..పెన్షన్ అందిస్తుంది. 

మీ వృద్ధాప్యంలో సెక్యూరిటీ లేదా నిర్ధిష్ట ఆదాయం ఉండాలని అనుకుంటే..ఇది మీ కోసమే. వృద్ధాప్యంలో లేదా రిటైర్మెంట్ తరువాత భవిష్యత్ కోసం ఆలోచించేవారికి ఎల్ఐసీ అద్భుతమైన పధకం ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యపు ఖర్చుల్ని సులభంగా నెట్టుకురావచ్చు. ఎల్ఐసీ కొత్తగా ప్రారంభించిన జీవన్ శాంతి పధకమిది. ఈ పాలసీలో మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..జీవితాంతం గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. దీనితో రిటైర్మెంట్ తరువాతి ఖర్చుల్ని నెట్టుకురావచ్చు.

ఎల్ఐసీ జీవన్ శాంతి పథకం వివరాలు ఇవీ

జీవన్ శాంతి పాలసీ అనేది పాత జీవన్ అక్షయ్ ప్లాన్ వంటిదే. జీవన్ శాంతి పాలసీలో మీరు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది ఇమ్మీడియేట్ ఎన్యుటీ కాగా రెండవది డిఫర్డ్ ఎన్యూటీ. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. మొదటిది అంటే ఇమ్మీడియేట్ ఎన్యుటీ పాలసీలో తీసుకున్న వెంటనే పెన్షన్ ప్రారంభమౌతుంది. ఇక రెండవది డిఫర్డ్ ఎన్యుటీ. ఇందులో పాలసీ తీసుకున్న 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది.

ఈ పధకం కింద పెన్షన్ ఎంతనేది నిర్ధారితంగా ఉండదు. మీ పెట్టుబడి, వయస్సు, ఢిఫర్‌మెంట్ పీరియడ్ ఆధారంగా పెన్షన్ ఎంతనేది నిర్ణయమౌతుంది. పెట్టుబడి, పెన్షన్ ప్రారంభానికి మధ్య సమయం ఎంత ఎక్కువగా ఉంది లేదా వయస్సు ఎంత ఎక్కువగా ఉందో పెన్షన్ అంతగా లభిస్తుంది. మీ పెట్టుబడి శాతాన్ని బట్టి పెన్షన్ లెక్క ఉంటుంది. 

ఎల్ఐసీ ప్రారంభించిన జీవన్ శాంతి పాలసీలో వయస్సు కనీసం 30 ఏళ్ల నుంచి గరిష్టంగా 85 ఏళ్లుండవచ్చు. ఇది కాకుండా జీవన్ శాంతి పాలసీలో రుణం,పెన్షన్ ప్రారంభమైన ఏడాది తరువాత సరెండర్ అవకాశం, పెన్షన్ ప్రారంభమైన 3 నెలల తరువాత సరెండర్ అవకాశాలున్నాయి. ఈ పధకం తీసుకునేముందు..ఒకసారి తీసుకున్న ఆప్షన్ తిరిగి మార్చుకునే అవకాశముండదని గ్రహించాలి. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో ప్రారంభించవచ్చు.

Also read: Post Office Schemes: పోస్టాఫీసులో అద్భుత పథకం, నెలకు 15 వందలతో 35 లక్షల లాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News