IRCTC Rail Connect App: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త యాప్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అత్యంత సులభంగా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమ్మర్ వెకేషన్ నడుస్తోంది. ఎక్కడికక్కడ ప్రయాణాలు ఊపందుకున్నాయి. అటు రైళ్లు, ఇటు బస్సులు రద్దీగా ఉంటున్నాయి. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలంటే రిజర్వేషన్ తప్పనిసరి. ప్రయాణీకులకు మరిన్ని వెసులుబాట్లు, మరింతగా సౌకర్యం కల్పించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అత్యంత సులువైన మార్గాన్ని సూచిస్తోంది. సులభంగా టికెట్ బుక్ చేసుకునేందుకు రైల్ కనెక్ట్ యాప్ ప్రవేశపెట్టింది. రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా తత్కాల్ టికెట్ కూడా మరింత సులభతరం కానుంది. 


రైలు కనెక్ట్ ద్వారా 3 సులభమైన దశల్లో టికెట్ బుకింగ్ చేయవచ్చు. ఇది 24 గంటలు పనిచేసే యాప్. దీనిద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు కూడా మీకు అందుతాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.



నేరుగా ఐఆర్‌సీటీసీలో కూడా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు కానీ..కొన్ని సంక్లిష్టంగా ఉంటాయి. అదే రైల్ కనెక్ట్ ద్వారా అయితే మూడే మూడు సులభమైన దశల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ వెల్లడిస్తోంది. 


Also read: MTNL Best Plan: రోజుకు 1 జీబీ డేటా, ఏడాది వ్యవధితో ఇంత చవకైన ప్లాన్ మరెక్కడా లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook