Indian Railways Good News: రైల్వేశాఖ కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. ఛార్ట్ ప్రిపేర్ అయిన తరువాత కూడా టికెట్ రద్దు చేసి..రిఫండ్ కోసం అప్లై చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కసారి అత్యవసరం వచ్చినప్పుడు లేదా మరేదైనా కారణంతో ..పూర్తిగా ఛార్ట్ ప్రిపేర్ అయిన తరువాత రైలు టికెట్ రద్దు చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో రిఫండ్ సాధారణంగా రాదు. కానీ రైల్వేశాఖ నిబంధనలు మారాయి. చివరి నిమిషంలో కూడా టికెట్ రద్దు చేసుకుని రిఫండ్ కోసం అప్లే చేయవచ్చు. ఎలాగనేది పరిశీలిద్దాం..


రైల్వే పాసెంజర్లకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. రైల్వే ఎప్పటికప్పుుడు కొత్త నిబంధనలు జారీ చేస్తుంటుంది. ఇందులో భాగంగా రైలు టికెట్ రద్దుకు సంబంధించి కొత్త అప్‌డేట్స్ వెలువరించింది. దీని ప్రకారం చివరి నిమిషంలో అంటే ఛార్ట్ పూర్తిగా ప్రిపేర్ అయిన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకోవచ్చు. రిఫండ్ కూడా పొందవచ్చు. భారతీయ రైల్వే ఇదే విషయాన్ని వెల్లడించింది. 


ఐఆర్సీటీసీ ఈ మేరకు ఒక వీడియో ట్విట్టర్‌లో షేర్ చేసింది. టికెట్ చివరి నిమిషంలో రద్దు చేసి రిఫండ్ పొందవచ్చనేది వివరించింది. అయితే టికెట్ డిపాజిట్ రిసీప్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 


టికెట్ డిపాజిట్ రిసీప్ట్ ఎలా సమర్పించాలి


ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in ఓపెన్ చేసి హోమ్‌పేజ్ నుంచి మై ఎక్కౌంట్‌లో వెళ్లాలి. తరువాత మెనూలో దిగువవ మై ట్రాన్‌సాక్షన్స్ క్లిక్ చేయయాలి. ఇక్కడ ఫైల్ టీడీఆర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎవరిపేరు మీద టికెట్ బుక్ అయుందో ఆ సమాచారం ఉంటుంది. ఇప్పుడు మీ పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి క్యాన్సిలేషన్ బాక్స్ టిక్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి తిరిగి సబ్మిట్ చేయాలి. పీఎన్ఆర్ వివరాలు చెక్ చేసుకుని క్యాన్సిల్ టికెట్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఇప్పుుడ హోమ్‌పేజ్‌పై రిఫండ్ మొత్తం ఎంతనేది వస్తుంది. అది మీ ఎక్కౌంట్‌కు బదిలీ అవుతుంది. 


Also read: Oppo K10 Smartphone: రూ.14990 విలువ చేసే ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.599కే... ఆఫర్ రేపటితో లాస్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook