Income Tax Return Last Date 2023: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవ్వడంతో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఆదాయపు పన్ను దాఖలులో ఈసారి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు చేర్పులు జరుగుతుండగా.. ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో కూడా మార్పులు జరిగాయి. దీంతో పాటు కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ బెనిఫిట్ మినహాయింపు పరిమితిని కూడా పెంచిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువు గురించి కూడా ప్రభుత్వం వెల్లడించింది. గడువును దృష్టిలో ముందుగా ఫైల్ చేయడం ఉత్తమం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడం గడువు మిస్ అయితే.. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 కాగా.. కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ను సకాలంలో దాఖలు చేయడం ప్రతి పన్ను చెల్లింపుదారుడి బాధ్యత. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. జరిమానాలు, చట్టపరమైన చర్యలతో సహా వివిధ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


జూలై 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైతే.. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చి.. జూలై 31 తర్వాత మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే తేదీని ప్రభుత్వం పొడిగిస్తే.. ఎలాంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు. 


చాలా మంది వ్యక్తులు ఐటీఆర్‌ను దాఖలు చేయకుండా.. పూర్తిగా తప్పించుకునేందుకు చూస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ప్రక్రియ గజిబిజీగా ఉండడంతో చాలా మందికి ఎలా ఫైల్ చేయాలో తెలియదు. ఐటీఆర్‌ను సకాలంలో దాఖలు చేసి చట్టపరమైన చిక్కులకు దూరంగా ఉండండి. 


Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్


Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook