Jio 5G Phone: కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ టెలీకం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో అతి తక్కువ ధరకు 5జి ఫోన్ లాంచ్ చేసే తేదీపై దాదాపు నిర్ణయం ఖరారైంది. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో(Relinace Jio)నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ కాబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5 జి మైబైల్స్ కంటే అత్యంత తక్కువ ధరకు 5జి మొబైల్ లాంచ్ చేయనున్నట్టు రిలయన్స్ జియో గతంలోనే ప్రకటించింది. అయితే ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. రిలయన్స్ 5జి మొబైల్ ధర 2 వేల 5 వందల రూపాయల్నించి 5 వేల రూపాయల మధ్యలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ప్రస్తుతం దేశంలో 2 జి ఫోన్ వాడుతున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రిలయన్స్ జియో ఈ 5జి మొబైల్ లాంచ్ చేయనుంది. అంటే ఏకంగా 20-30 కోట్లమంది యూజర్ల కోసం రిలయన్స్ వ్యూహం సిద్ధం చేసింది. ప్రస్తుతం దేశంలో 5జి మొబైల్ (5G Mobile) ధర 20 వేల నుంచి ప్రారంభమవుతోంది. దేశంలో 5జి టెక్నాలజీ ఇంకా అందుబాటులో రానప్పటికీ..5జి మొబైల్స్ విక్రయాలు మాత్రం బాగానే జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అతి తక్కువ ధరకు జియో 5 జి మొబైల్ లాంచ్ చేయబోతోంది. జూన్ 24వ తేదీన జరిగే వాటాదారుల సమావేశంలో జియో 5 జి ఫోన్ లాంచ్ చేయనున్నట్టు సమాచారం. అదే సమావేశంలో జియోబుక్(Reliance JioBook Laptop) పేరుతో సరసమైన ధరకు ల్యాప్‌టాప్ కూడా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 


Also read: Gold Rate Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా బంగారం ధర, వెండి పతనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook