ఎల్ఐసీ. దేశంలోనే అతిపెద్ద భీమా రంగ సంస్థ ఇప్పుడు కొత్తగా ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ప్రవేశపెట్టింది. మీ కుమార్తె భవిష్యత్, పెళ్లి అవసరాల్ని పూర్తిగా తీర్చే పాలసీ ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో మూడేళ్లే పెట్టుబడి


ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో కేవలం మూడేళ్ల కాలపరిమితి కోసం మీకు కావల్సిన ప్రీమియం ఎంచుకోవచ్చు. రిటర్న్ మాత్రం మెచ్యూరిటీ పూర్తయ్యాక చేతికి అందుతుంది. ఈ పాలసీలో ఇన్వెస్టర్ ఏడాదికి 50 వేల చొప్పున  మూడేళ్ల పాటు చెల్లించవచ్చు. అయితే ఈ పధకంలో ఇన్వెస్టర్ కనీస వయస్సు 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉండాలి. కుమార్తె వయస్సు కనీసం 1 ఏడాది అయుండాలి. 


ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ మెచ్యూరిటీ


ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ మెచ్యూరిటీ 13 ఏళ్లుంటుంది. ప్రీమియం మాత్రం విభిన్న రకాలుగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే మీ ఆధార్ కార్డు, ఆదాయం ధృవీకరణ పత్రం, ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికేట్ అవసరమౌతాయి.


ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో రిటర్న్స్ ఎంత


మీరు ఒకవేళ 10 లక్షల రూపాయలకు ఇన్వెస్ట్ చేస్తుంటే నెలకు 3,901 రూపాయలు 22 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. మరో మూడేళ్ల తరువాత అంటే పాలసీ తీసుకున్న 25 ఏళ్లకు మీకు 26.75 లక్షల రూపాయలు మెచ్యూరిటీ అందుతుంది. 


ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ప్రయోజనాలు


ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకుంటే ట్యాక్స్ మినహాయింపులు వర్తిస్తాయి. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80 సి ప్రకారం 1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 


Also read: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న బంగారం ధరలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook