Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న బంగారం ధరలు..!

Gold Silver Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్. త్వరలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో బంగారం రేట్లు ప్రతి రోజూ పెరుగుతున్నాయి. త్వరలోనే ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 03:27 PM IST
  • కొత్త ఏడాదిలో పెరుగుతున్న బంగారం ధరలు
  • రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం
  • వెండి ధర కూడా భారీగా పెరిగే ఛాన్స్
Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న బంగారం ధరలు..!

Gold Silver Price Today: దేశీయ మార్కెట్‌లో ప్రతిరోజు బంగారం, వెండి ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుతున్నాయి. ఇంకొన్ని రోజులు మాత్రం స్థిరంగా ఉంటాయి. నిత్యం బంగారం, వెండి ధరలలో మార్పులు చోటుచేసుకోవడానికి కారణం.. పలు దేశ భౌగోళిక పరిస్థితులు, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వ. అయితే బంగారం వ్యాపారం మాత్రం మూడు చైన్లు.. ఆరు ఉంగరాలు అన్న రీతిలో సాఫీగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. వెండి ధర రూ.70 వేల దగ్గర నడుస్తోంది. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ.62 వేలు, వెండి కిలో రూ.80,000 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2023 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు కారణంగా బంగారం సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మారింది. దీంతో బంగారం అమ్మకంలో బూమ్ కనిపిస్తోంది. ఈ ఏడాది బంగారం రేటు 10 గ్రాములకు రూ.62 వేలు వరకు పెరుగుతుందని అంచనా.

వడ్డీ రేట్ల తగ్గింపు..

డాలర్ బలహీనత, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వృద్ధిపై నిషేధం విధించే అవకాశం ఉన్నందున విలువైన మెటల్ కూడా ఊపందుకునే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేటును తగ్గించవచ్చు. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. భౌగోళిక రాజకీయ సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా రాబోయే కాలంలో బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక మాంద్యంలో బంగారం పెట్టుబడులు ఆకర్షిస్తాయని బ్రోకరేజ్ పేర్కొంది. 

ఎంసీఎక్స్‌లో బంగారం ధర

మంగళవారం మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో రూ.420 లాభంతో 10 గ్రాముల బంగారం రూ.55598 వద్ద ట్రేడవుతోంది. ఇది కాకుండా వెండి కిలో రూ.70800 వద్ద రూ.1229 వేగంతో ట్రేడవుతోంది. క్రితం సెషన్‌లో వెండి కిలో ధర రూ.69571 వద్ద.. బంగారం ధర 10 గ్రాములు రూ.55178 వద్ద ముగిసింది. ఆగస్టు 2020లో బంగారం రికార్డు రూ.56,200. ప్రస్తుతం బంగారం ధర రికార్డు స్థాయికి కొంచెం దూరంగా ఉంది. అయితే రానున్న కాలంలో బంగారం ధర ఈ స్థాయిని మించిపోతుందని అంచనా.

బులియన్ మార్కెట్లో కూడా..

బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం, వెండి రెండూ జోరందుకున్నాయి. ఇండియా బులియన్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధర ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.540 పెరిగి రూ.55702కి చేరుకుంది. కిలో వెండి ధర 1310 రూపాయలు పెరిగి 69,659 రూపాయలకు చేరుకుంది. క్రితం రోజు కిలో వెండి ధర రూ.68,349 వద్ద ముగిసింది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55479, 10 గ్రాములు 22 క్యారెట్లు రూ.51023, 18 క్యారెట్లు 10 గ్రాములు రూ.41777కి చేరాయి.

Also Read: YSRCP: చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ డిమాండ్.. సరికొత్త నిరసనకు పిలుపు  

Also Read: Thief Sleeping: దొంగతనానికి వచ్చి తాపీగా నిద్రపోయిన దొంగ.. చివరికి ఊహించని ట్విస్ట్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News