Zuckerberg Net Worth: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా ప్లాట్​ఫామ్స్ ఐఎన్​సీ​ (గతంలో ఫేస్​బుక్​ ఐఎన్​సీ) అధినేత మార్క్​ జుకర్​బర్గ్​కు రికార్డు స్థాయిలో నష్టం వాటిళ్లింది. ఒక్క రోజులోనే మార్క్ సంపదలో 29.8 బిలియన్ డాలర్లు (రూ.2.2 లక్షల కోట్లపైమాటే) తుడిచిపెట్టుకు పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో నష్టం వాటిళ్లిన నేపథ్యంలో మార్క్ జుకర్​బర్గ్ సంపద ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లకు (రూ.6.34 లక్షల కోట్లు) తగ్గింది. దీనితో ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్​బర్గ్​ స్థానంలో 12కు పడిపోయింది.


అదానీ, అంబానీల కన్నా దిగువకు..


ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఇండియాలో అత్యంత సంపన్నులైన గౌతమ్​ అదానీ, ముకేశ్ అంబానీల కన్నా దిగువకు చేరారు మార్క్​ జుకర్​బర్గ్​.


అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద విలువ ప్రస్తంత 90.1 బిలియన్​ డాలర్లు (రూ.6.73 లక్షల కోట్లు).


రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 89.4 బిలియన్​ డాలర్లు (రూ.6.67 లక్షల కోట్లపైమాటే).


మార్క్ జుకర్​బర్క్​కు అంత నష్టం ఎందుకొచ్చింది?


వాల్​ స్ట్రీట్​లో మెటా స్టాక్స్​ గురువారం జీవనకాల రికార్డు పతనాన్ని నమోదు చేశాయి. నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మెటా ఫలితాలు నిరుత్సాహపరచడం, వర్చువల్​ రియాలిటీ వ్యాపారాల్లో.. రోజువారి యూజర్లు తగ్గిపోతున్నట్లు కంపెనీ ప్రకటించడం సహా ఐరోపా దేశాలు అధిక ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 'మెటావర్స్​'కు ఈ స్థాయి నష్టం వచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.


ఈ కారణాలన్నింటితో గురువారం ఒక్క రోజే కంపెనీ షేర్లు 26 శాతం నష్టాన్ని నమోదు చేశాయి. దీనితో కంపెనీ మార్కెట్ విలువ కేవలం ఒక్క సెషన్​లోనే 200 బిలియన్ డాలర్లు పడిపోయింది.


దిగ్గజ కంపెనీల షేర్లన్నీ ఢమాల్​..


  • నాస్డాక్​లోయాపిల్ షేర్లు 1.67 శాతం కుప్పకూలాయి.

  • అమెజాన్​ షేర్లు భారీగా 7 శాతం నష్టపోయాయి.

  • మైక్రోసాఫ్ట్ షేర్లు 3.9 శాతం నష్టాన్ని చవిచూశాయి.

  • టెస్లా 1.6 శాతం నష్టాన్ని నమోదు చేసింది.

  • గుగూల్ మాతృసంస్థ అల్ఫాబెట్​ 3.32 శాతం పడిపోయింది.


Also read: Flipkart Electronics Sale 2022: రూ.4,500లకే శాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ- ఈరోజే తుదిగడువు!


Also read: LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook