Gold Price Today Feb 2 2022 : బంగారం ధరల్లో నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవనే చెప్పాలి. 24 క్యారెట్ల బంగారంపై నిన్నటితో పోలిస్తే కేవలం రూ.100 ధర తగ్గింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేల మార్క్‌కి కాస్త అటు, ఇటుగా ఉంది. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని ధరల్లో కొంత హెచ్చు తగ్గులు ఉండొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,990గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.10 మేర ధర తగ్గింది. గడిచిన వారం రోజుల్లో బంగారం ధర గరిష్ఠంగా రూ.50,100కి చేరి ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వచ్చింది.
విజయవాడలోనూ ఇంచుమించుగా హైదరాబాద్ మార్కెట్‌లోని ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,980గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,320 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980గా ఉంది.
Also Read: Horoscope Today Feb 2 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవర్స్‌తో మనస్పర్థలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook