Best MPV Car: సాదారణంగా ఎంపీవీ లేదా ఎస్‌యూవీ కార్లు ధర ఎక్కువగా ఉంటాయి. కానీ పెద్ద కుటుంబాలకు, దూర ప్రయాణాలు చేసేవారికి ఇవే అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఎస్‌యూవీ కొనే కంటే అదే ధరకు మార్కెట్‌లో అందుబాటులో ఎంపీవీ 7 సీటర్ కార్లు లభిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీవీ అంటే కారుకు, వ్యాన్‌కు మధ్య శ్రేణి వాహనం. సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారుతో పోలిస్తే ఇందులో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమందికి సీటింగ్ ఉంటుంది. వ్యాన్‌తో పోలిస్తే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవి మైలేజ్ కూడా ఎక్కువే ఇస్తాయి. ఎంపీవీ కార్లు సాధారణంగా పెద్ద కుటుంబాలకు బాగా ఉపయోగపడతాయి. ఎంపీవీ కార్ల కోసం చూసేవారికి బెస్ట్ ఆప్షన్ మారుతి సుజుకి ఎర్టిగా. ఇదొక అద్భుతమైన ఎంపీవీ. ఇండియాలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎంపీవీ. ధర అందుబాటులో ఉండటమే కాకుండా ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. 


మారుతి సుజుకి ఎర్టిగా అంటే తెలియనివాళ్లుండరు. చాలా కాలంగా అందరి మన్ననలు పొందుతోంది. దర అందుబాటులో ఉంటుంది. ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. ఇదొక 7 సీటర్ కారు. ఈ కారు 1.5 లీటర్ గ్యాసోలీన్ ఇంజన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 102 బీహెచ్‌పి పవర్, 137 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఉంటుంది. సీఎన్జీ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్‌లో 87 బీహెచ్‌పి పవర్, 121 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 


మారుతి సుజుకి ఎర్టిగా ధర 8,69 వేల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో టాప్ ఎండ్ జెడ్‌ఎక్స్ఐ ప్లస్ ఏటీ ధర 13 లక్షల 3 వేలుగా ఉంది. మారుతి సుజుకి ఎర్టిగాలో చాలా వేరియంట్లు ఉన్నాయి. ఇందులో LXi,VXi,ZXi,ZXi Plus AT వేరియంట్లు మొ1త్తం 7 రంగుల్లో ఉన్నాయి. మారుతి సుజుకి ఎర్టిగాను క్యారెన్స్, రీనో ట్రైబర్, హ్యుండయ్ అల్కజార్ కార్లతో పోల్చవచ్చు.


Also read: Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ ఎలా చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook