Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ ఎలా చేయాలి

Aadhaar Card Update: దేశంలో ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరంగా మారింది. అందుకే ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఆధార్ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 15, 2024, 02:53 PM IST
Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ ఎలా చేయాలి

Aadhaar Card Update: దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా వివిధ సందర్భాల్లో ఆధార్ నిర్ధారణ చాలా అవసరమౌతోంది. ఆందుకే ఆధార్ కార్డును అప్‌డేటెడ్‌గా ఉంచాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో ఇంట్లో కూర్చుని కూడా ఆధార్ కార్డు అప్‌డేట్ చేయవచ్చు.

దేశంలో ఆధార్ కార్డు దాదాపు అందరికీ ఉంది. కానీ అందులో చాలామంది ఎప్పుడే పదేళ్ల క్రితం లేదా అంతకంటే ముందు తీసుకుని కనీసం అప్‌డేట్ చేయుకుండా వదిలేస్తుంటారు. ముఖ్యంగా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడం, ఫోటో మార్చుకోవడం, అడ్రస్ మార్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల్ని ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశమిచ్చింది. పలుమార్పు గడువు పొడిగించింది. పాత ఫోటోల్ని అప్‌డేట్ చేసుకుంటే మంచిది. లేకపోతే వివిధ రకాల పనుల్లో ఇబ్బంది కలుగుతుంది. 

కొంతమంది అప్‌డేట్ చేసుకున్నా ఫోటోలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతుంటారు. ఆధార్ కార్డులో మీ ఫోటోలు కూడా సరిగ్గా లేకపోతే అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి అప్‌డేట్ ఫారం ఫిల్ చేసివ్వాలి. మీ బయోమెట్రిక్ వివరాలు సమర్పించాలి. ఫోటో అప్‌డేట్ కోసం ఎలాంటి నిర్ధారణ కాగితాలు అవసరం లేదు. అడ్రస్ మార్పు, పుట్టినతేదీలో తప్పులు వంటివాటికే నిర్ధారణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీ వివరాలు అన్నీ అప్‌డేట్ అయ్యాక రిసీప్ట్ జారీ అవుతుంది. ఈ రిసీప్ట్‌లో నెంబర్ ఆధారంగా మీ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 

ఒకసారి అప్‌డేట్ అయిన తరువాత పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అటు మీ ఇంటికి కూడా పోస్ట్ ద్వారా ఆధార్ కార్డు చేరుతుంది. ఆధార్ కార్డులో ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకునేందుకు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ 12 అంకెల్ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్‌పై కన్పించే అప్‌డేట్ ఆధార్ కార్డు ఆప్షన్ క్లిక్ చేయాలి.

Also read: Bajaj CNG Bike: ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News